Share News

ప్రజా ఆశీర్వాదంతోనే కేంద్రంలో మరోసారి అధికారం

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:25 AM

ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆశీర్వాదించడంతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుం దని జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు.

ప్రజా ఆశీర్వాదంతోనే కేంద్రంలో మరోసారి అధికారం

మంథని, జూన్‌ 6: ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆశీర్వాదించడంతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుం దని జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు. గురువారం సునీల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానిగా ఎన్నిక కావడం శుభ సూచకం, మరింత బాధ్యతగా దేశాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రలో బీజేపీ సత్తా చాటిందని, కాంగ్రెస్‌కి రాష్ట్రంలో గట్టి పోటీనిచ్చే బీజేపీ అని మరోసారి ప్రజలు గ్రహించి 8 ఎంపీ సీట్లు ఇచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బీ జేపీ రాష్ట్రంలో మరింత పుంజుకుందన్నారు. దేశంలో రాజకీయాలు చేస్తానని, విర్రవీ గిన కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో ఉనికి లేకుండాపోయిందని, ఒక సీటు రాకుం డా కొట్టుకుపోయిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో కూడా అధికారం లో కి వస్తుందనడానికి పార్లమెంట్‌ ఎన్నికలే నిదర్శనమన్నారు. పెద్దపెల్లి పార్లమెంట్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ గట్టి పోటీనిచ్చిందని, కాంగ్రెస్‌ జూట హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్రమోదీకి, రాష్టం లో గెలుపొందిన పార్లమెంట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మంథని నియోజకవర్గ అసెంబ్లీ కో-కన్వీనర్‌ నాంపల్లి రమేష్‌, పట్టణ అధ్యక్షుడు స బ్బని సంతోష్‌, నేతలు బోగోజు శ్రీనివాస్‌, రాపర్తి సంతోష్‌, కోరబోయిన మల్లికార్జున్‌, ఓజ్జల మురళి కృష్ణలు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:25 AM