Share News

పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయాలి

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:22 AM

పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) చట్టాన్ని రద్దు చేయాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయాలి

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 16: పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) చట్టాన్ని రద్దు చేయాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆల్‌ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, తెలంగాణ టీఎన్‌జీవోస్‌ కేంద్ర సంఘం పిలుపు మేరకు టీఎన్‌జీవో ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై, మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ సీపీఎస్‌(కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం) రద్దు చేయాలని, ఉద్యోగుల ఆదాయపరిమితిని రూ.10లక్షలకు పెంచాలని, ప్రైవేటైజేషన్‌ ఆలోచన విరమించుకోవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యుల రైజ్‌ చేయాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు నాగుల నరసింహ స్వామి, రాగి శ్రీనివాస్‌, సర్దార్‌ హర్మిందర్‌ సింగ్‌, రాజేశ్‌భరద్వాజ్‌, కిషన్‌, శారద, విజయలక్ష్మీ, హరిప్రి య, విజయలక్ష్మీ, గూడ ప్రభాకర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, పవన్‌కుమార్‌, నగేశ్‌, శంకర్‌, లింగయ్య, గంగారపు రమేశ్‌, రాజేశ్వర్‌రావు, నర్సయ్య, అభిషేక్‌, మన్మిత్‌సింగ్‌, కొండయ్య, రామస్వామి, నరసింహరెడ్డి, కమలా కర్‌, కరుణాకర్‌, రాజశేఖర్‌రెడ్డి, ప్రణీత్‌, లలిత, మేరి, రమణ, లత, జలాలుద్దీన్‌అక్బర్‌, తిరుమల్‌రావు, నారాయణ సాత్విక్‌, రజనీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:22 AM