Share News

సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:59 PM

ధర్మపురి నియోజకవర్గ ప్రాం తంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూప నున్నట్టు ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చెప్పారు.

సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

ధర్మారం, మార్చి 27: ధర్మపురి నియోజకవర్గ ప్రాం తంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూప నున్నట్టు ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చెప్పారు. బుధవారం మండలంలోని నందిమేడారంలోగల నంది రిజర్వాయర్‌లో నీటిమట్టా న్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరు లతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రాంత రైతులకు సాగునీరు అందించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి వివరించినట్టు తెలిపారు. ఈమేరకు పాల కుర్తి మండలం వేమునూర్‌ పంప్‌హౌస్‌ ద్వారా నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని సీఎం ఇరిగేషన్‌ అధికారులను అదేశించారని ఆయన వివరిం చారు. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించేలా శాశ్వత పరిష్కారం చూపించేందుకు త్వరలోనే ఇరిగేషన్‌ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటిస్తారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వహయాంలో పంప్‌హౌస్‌ మోటార్లు చెడిపోయినా మర మ్మతులు చేయించలేదని ఆయన ఆరోపించారు. 2016లో స్వయం గా అప్పటి సీఎం ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్‌ ఏర్పాటుచేసి వెల్గటూర్‌, ధర్మారం మండలాలకు సాగునీటిని అంది స్తామని ప్రకటించి తర్వాత మాట మార్చారని ఆయన దుయ్యబ ట్టారు. అయినసప్పటికీ ఈప్రాంత రైతులకు సాగునీటిని ఆందించేం దుకు సీఎం రెవంత్‌రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. రైతు లు ఆందోళనకు గురికావద్దని కోరారు. వెంట కాంగ్రెస్‌ పార్టీ మండ ల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు చింతల జగన్‌మో హన్‌రెడ్డి, కోమటిరెడ్డి దేవేందర్‌రెడ్డి, దేవి జనార్థన్‌, కాడే సూర్యానారా యణ, పాలకుర్తి రాజేశం, కొత్త నర్సింహం, చిప్ప మణిశర్మ, లింగ య్య తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:59 PM