Share News

ప్రజలు మోదీ నియంతృత్వ పాలన పోవాలని కోరుకుంటున్నారు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:37 PM

: ప్రజలంతా మోదీ నియంతృత్వ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. డీసీసీ అధ్యక్షులు, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి శుక్రవారం నగరంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో మార్నింగ్‌ వాక్‌ చేశారు. ఇండోర్‌ స్టేడియం, యోగా సెంటర్లో క్రీడాకారులతో కలిసి ఆడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మంత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నియంతృత్వ పాలన పోవాలని, మానవతావాది అయిన రాహుల్‌ గాంధీ నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

ప్రజలు మోదీ నియంతృత్వ పాలన పోవాలని కోరుకుంటున్నారు

కరీంనగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 19 : ప్రజలంతా మోదీ నియంతృత్వ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. డీసీసీ అధ్యక్షులు, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి శుక్రవారం నగరంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో మార్నింగ్‌ వాక్‌ చేశారు. ఇండోర్‌ స్టేడియం, యోగా సెంటర్లో క్రీడాకారులతో కలిసి ఆడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మంత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నియంతృత్వ పాలన పోవాలని, మానవతావాది అయిన రాహుల్‌ గాంధీ నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వివిధ సంస్థల నుంచి నల్లధనాన్ని తీసుకునేందుకు ఎలక్ర్టోరల్‌ బాండ్లను రూపొందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం నేరుగా అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకంగా తీసుక వచ్చిన నిధులు ఏమీ లేవన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నాడని, ఇంత ఈర్ష ఎందుకని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ ప్రసాద్‌ స్కీం కింద నాలుగు ప్రముఖ దేవాలయాలకు ఒక్క రూపాయి కూడా ఎందుకు తేలేకపోయాడని, దీనిపై సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఆగస్టు 15 తర్వాత రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు వచ్చే వర్షాకాలంలో 500 రూపాయల బోనస్‌ ఇస్తామన్నారు. భవిష్యత్తులో ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత మాదేనన్నారు. బండి సంజయ్‌, గంగుల కమలాకర్‌ల మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందేనని, వినోద్‌రావును ఓడించేందుకు కమలాకర్‌ సంజయ్‌తో ఏ విధంగా కుమ్మక్కు అయ్యిండో తెలుసని, స్మార్ట్‌ సిటీ అవినీతి విషయంలో, అభివృద్ధి పనుల విషయంలో ఒకరినొకరు ఎందుకు ప్రశ్నించుకుంటలేరో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతూ గుడిలో ఉన్న దేవుడిని బజారులోకి తెచ్చారన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ రాముడి ఫొటోలు బీజేపీ వద్ద ఉంటే... రాముడి ఆత్మ కాంగ్రెస్‌ పార్టీ వైపు ఉందన్నారు. బండి సంజయ్‌ ఎంపీ లాడ్స్‌ నుంచి కేవలం ఐదు కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు పెట్టాడని, మిగతా ఎంపీలు వారి కోటా నుంచి 8 నుంచి 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టార న్నారు. కరీంనగర్‌లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలనుకుంటున్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి ల్యాండ్‌ మంజూరు చేయించి, నా వంతు కోటి రూపాయల విరాళం ఇస్తానని రాజేందర్‌రావు ప్రకటించారు. మార్నింగ్‌ వాక్‌లో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్‌లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:37 PM