పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:25 AM
రెండు సంవత్సరాలుగా తమకు రావాలసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సుభాష్‌నగర్, జూన్ 16: రెండు సంవత్సరాలుగా తమకు రావాలసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు లక్షల రూపాయల బిల్లులు కూడా పాస్ కావడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా బిల్లులు పాస్ కావడం లేదన్నారు. 30 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఏనాడు రాలేదన్నారు. అన్ని రకాల కాంట్రాక్టర్లు బిల్లులు రాక, ఇంట్లోవాళ్ల బంగారం తాకట్టుపెట్టి పనులను పూర్తి చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కాంట్రాక్టర్ల పాత్రకూడా ఉందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కాంట్రాక్టు పనులు చేసిన వారి బిల్లులు చెలించి, స్థానికులను ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేశారు. లేకపోతే కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, హైదరాబాద్‌లో భిక్షాటన చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల మోహన్, ప్రధానకార్యదర్శి రోసెల్లి కిషన్‌రావు, చీఫ్ అడ్వైజర్ కొప్పుల అజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు చిందం శ్రీనివాస్, కోశాధికారి పి రామచంద్రం, ఆర్గనైజింగ్ సెక్రెటరీ దుర్గం మహేందర్‌రాకేశ్, కార్యదర్శి ఆనందరావు, ఒర్సు భిక్షపతి, గంట శివకుమార్, కాడె శంకర్, హన్మండ్ల ప్రభాకర్, గుడ్డూరు నర్సయ్య, ఒర్సు కుమారస్వామి, జి కృష్ణారావు, ఈ శివారెడ్డి, సిహెచ్ రవిందర్‌రెడ్డి, బి ప్రకాశ్‌రావు, ఎస్ సునీల్‌కుమార్, బి శేఖర్, బడ్డె మధన్‌మోహన్‌రెడ్డి, దర్సింగ్, జగత్పాల్‌రెడ్డి, బద్దం హన్మంతరెడ్డి పాల్గొన్నారు.