మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:49 AM
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు.

సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 11: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళ వారం ఏఐటీయూసీ తెలంగాణ మధ్యాహ్నభోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నభోజన కార్మికులు ధర్నా చేశారు. ఈ సంద ర్భంగా జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ మధ్యాహ్నభోజనం తయారు చేసే కార్మికలకు చెల్లిం చాల్సిన పెండింగ్ మెస్ బిల్లులను పెంచడంతోపాటు పెంచిన వేతనాలను సత్వరమే అందజేయాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజనం తయారీ కార్మికులకు రూ.10వేల వేతనం ఇస్తామని ఇచ్చిన హామీలను అముల చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని, వంట తయారు చేసే పాత్రలను ఇవ్వాలని అన్నారు. వంట సరుకులతోపాటు గ్యాస్ సిలిండర్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, లేకుంటే స్లాబ్ రేటు రూ.25 చెల్లించాలన్నారు. వయస్సు పైబడిన వారికి పదవీవిరమణ బెనిఫిట్ రూ.5లక్షలు చెల్లించాల న్నారు. ఎంఆర్‌వో ద్వారా వంట కార్మికులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. కార్మికులకు సంవత్సరానికి రెండు జతల యూనిఫాం, రాగిజావ, అల్పాహారం అందించినందుకు అదనపు వేతనం చెల్లించాలన్నారు. ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. మధ్యాహ్నభోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించా లంటూ జిల్లా విధ్యాధికారి రమేష్‌కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు మీసం లక్ష్మణ్, జూబేదా, రజియాహసీనీబేగం, నర్సవ్వ, మానస, సరోజన, లావణ్య, లక్ష్మీ, పోచమ్మ, బాలలక్ష్మీ, మహేఽఽశ్వరీ, రేఖ, సాయిలు, మణేమ్మ, రాజేఽశ్వరి తదితరులు పాల్గొన్నారు.