పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:55 AM
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాల ని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అధికారులకు సూచించారు.

రామగిరి, జూలై 27: పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాల ని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అధికారులకు సూచించారు. శనివారం తహసీ ల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న భూసమస్యలపై దృష్టి పెట్టి తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని పెండింగ్ ధరణి సమస్యలు, భూ సేకరణ, సర్టిఫికెట్ జారీ తదితర అంశాలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వ హించారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సమావేశంలో చర్చించారు. వెల్గలపహాడ్, అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మీ సేవా ద్వారా వచ్చిన సర్టిఫికెట్స్ దరఖాస్తులను పరిశీలించి వెనువెంటనే జారీచేయాల్సిందిగా పేర్కోన్నారు. ఈ సమావేశంలో తహసీ ల్దార్ రాంచందర్‌రావు, డిప్యూటీ తహసీల్దార్ మానస, ఆర్‌ఐలు మహేష్‌బాబు, నిహా రిక, సిబ్బంది పాల్గొన్నారు.