Share News

క్రీడలతో మానసికోల్లాసం

ABN , Publish Date - May 26 , 2024 | 12:32 AM

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొంది స్తాయని ఆర్‌జీ-1 జీఎం చింతల శ్రీనివాస్‌ అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం

గోదావరిఖని, మే 25: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొంది స్తాయని ఆర్‌జీ-1 జీఎం చింతల శ్రీనివాస్‌ అన్నారు. గత నెల రోజు లుగా వర్క్‌పీపుల్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో సింగరేణి స్టేడి యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు మానసిక పరిపకృత్వానికి ఉపయోగపడుతాయని, జీవితం లో ఏదైనా సాధించాలనే తపన పట్టుదల పెరగడమే కాకుండా ప్రతి ఒక్కరూ గెలుపొందాలనే పోటీతత్వం, క్రమశిక్షణ అలవడు తుందని, గతంలో వేసవి సెలవులు వస్తే వివిధ ఊర్లకు, గ్రామా లకు వెళ్లడం, అక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, సర దాగా గడపడం జరిగేదని, కానీ నేడు సెల్‌ఫోన్లు, టీవీలకు అతక్కు పోవడం వల్ల పిల్లల్లో క్రీడలపై ఆకస్తి తగ్గుతుందన్నారు. క్రీడలు భావి భారత జీవితానికి బాటలు వేస్తుందన్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, అథ్లెటిక్‌, బాస్కెట్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, కరాటేలో శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. అనంతరం శిక్షణ పొందిన క్రీడాకారులకు టీషర్ట్స్‌, షార్ట్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (పర్సనల్‌)లక్ష్మీనారాయణ, ఎస్‌ఓటూ జీఎం రాంమోహన్‌, సీఎంఓఏఐ కార్యదర్శి మల్లేషం, ఎస్టేట్‌ అధికారి బాల సుబ్రహ్మణ్యం, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి రంగు శ్రీనివాస్‌, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ కార్యదర్శి బంగారు సారంగపాణి, సూపర్‌వైజర్‌ రమేష్‌, కోఆర్డినేటర్‌ రాజయ్య, కోచ్‌లు షబా నా, సోనియా, వినోద్‌, శ్రీనివాస్‌, మొండయ్య, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:32 AM