Share News

పంచాయతీల పన్ను వసూళ్లలో అగ్రస్థానం

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:11 AM

గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరైన పన్నుల వసూళ్లలో జగిత్యాల జిల్లా పంచాయతీ అధికా రులు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నారు.

పంచాయతీల పన్ను వసూళ్లలో అగ్రస్థానం

జగిత్యాల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరైన పన్నుల వసూళ్లలో జగిత్యాల జిల్లా పంచాయతీ అధికా రులు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో 98.3 శాతం పన్ను వసూళ్లతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదే సమ యంలో రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, నారాయణ పేట జిల్లాలు సై తం 98 శాతం పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను వసూళ్లను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు జిల్లాలో రూ. 12.51 కోట్లు వసూళ్లు జరిపి ఉన్నతాధికారులచే శభాష్‌ అనిపించుకుంటు న్నారు. జిల్లాలోని మేడిపల్లి మండలంలోని 25 గ్రామ పంచాయతీలు వంద శా తం పన్ను వసూళ్లను పూర్తి చేసి ముందంజలో ఉన్నాయి. గత యే డాది లక్ష్యంలో వందశాతం వసూలు చేశారు. ఈ ఏడాది సైతం వంద శాతం వసూలు అయ్యేలా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లు జరపడానికి ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా లక్ష్యం ఇలా...

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 12.79 కోట్ల పన్ను వసూలు చేయాలన్న లక్ష్యం ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ. 12.51 కో ట్లు పన్ను వసూలు అయింది. ఇంకా జిల్లాలో రెండు శాతం పన్ను వ సూలు చేయాల్సి ఉంది. పన్ను వసూలులో మేడిపల్లి మండలం 100 శా తం వసూలు చేసి అత్యధికంగా ఉండగా, బుగ్గారం, ఇబ్రహీంపట్నం మం డలాలు 94 శాతం వసూలు చేసి అత్యల్పంగా ఉంది. సాధ్యమైనంత తొం దరలో వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలన్న దిశగా అధికారులు ప్రయ త్నాలు చేస్తున్నారు.

సిబ్బందికి దిశా నిర్దేశం...

రెండు, మూడు మాసాలుగా ఆస్తి పన్ను వసూళ్లను పంచాయతీ కార్య దర్శులు ముమ్మరం నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో 98.3 శాతం వసూలు చేశారు. వందశాతం వసూలు అయ్యేలా అధికారులు సిబ్బందికి దిశా నిర్ధేశం చేశారు. ఆయా గ్రామాల్లో కార్యదర్శులు కార్యాలయాల్లో ప న్ను వసూలు చేయడంతో పాటు ఇంటింటికి తిరిగి వసూలు చేస్తున్నారు. జిల్లాలోని బీర్‌పూర్‌ మండలంలో 99 శాతం, ధర్మపురిలో 99, గొల్లపల్లిలో 98, ఇబ్రహీంపట్నం 94, మేడిపల్లి 100, జగిత్యాల 95, జగిత్యాల రూరల్‌ 98, కథలాపూర్‌ 97, కొడిమ్యాల 97, కోరుట్ల 98, మల్లాపూర్‌ 97, మల్యాల మండలంలో 98 శాతం వసూళ్లు అయ్యాయి. మెట్‌పల్లిలో 99, పెగడపల్లి 99, రాయికల్‌ 99, సారంగపూర్‌ 98, వెల్గటూరు మండలంలో 99 శాతం పన్ను వసూళ్లు అయ్యాయి.

మేడిపల్లి మండలంలో వంద శాతం పూర్తి...

జిల్లాలోని మేడిపల్లి మండలంలోని 25 గ్రామ పంచాయతీలు గత నెల 31వ తేదీ వరకు వంద శాతం పన్ను వసూళ్లు చేశాయి. మేడిపల్లి మం డలంలో రూ. 70.15 లక్షల వసూలు చేయాలన్న లక్ష్యానికి గానూ రూ. 70.17 లక్షలు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. లక్ష్యానికి మించి ఆ స్తి పన్ను వసూలు చేసి మేడిపల్లి మండల పంచాయతీ అధికారులు ఉ న్నతాధికారులచే ప్రశంసలు అందుకుంటున్నారు.

పంచాయతీలకు రానున్న నిధులు...

గ్రామ పంచాయతీలు స్వయం పోషకాలుగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. పంచాయతీలకు ఇంటి పన్ను, తాగునీటి ప న్నుతో పాటు వాణిజ్య దుకాణాలు, ఫ్యాక్టరీల నుంచి లైసెన్స్‌ ఫీజులు వ సూలు చేస్తాయి. పంచాయతీల్లో పన్నులను గ్రామ కార్యదర్శులు వసూ లు చేస్తారు. అయితే నిధుల కోసం పంచాయతీలు ఆరాట పడుతుంటా యి. ప్రభుత్వ పరంగా ఎస్‌ఎఫ్‌సీ, ఆర్థిక సంఘం నుంచి మాత్రమే నిధు లు మంజూరవుతాయి. ఇది కూడా జనాభా ప్రతిపాదికన రూ. 2 లక్షల లోపు మాత్రమే ఆయా పంచాయతీలకు వస్తాయి. పలు అవసరాలకు పంచాయతీలకు పన్నుల రూపేణ వచ్చే సొమ్మే దిక్కు అవుతుంది. కేం ద్రం కూడా వందశాతం పన్ను వసూలు అయితేనే ప్రత్యేకంగా గ్రాంట్లు ఇ స్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో జగిత్యాల జిల్లా పంచాయతీలు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారింంచి ఇప్పటికే 98.3 శాతం లక్ష్యం పూర్తి చేసింది.

ప్రత్యేక వెబ్‌ సైట్‌లో వివరాల నమోదు...

గ్రామ పంచాయతీల్లో 2017-18 నుంచి డిమాండ్‌, కలెక్షన్‌, బ్యాలెన్స్‌ను ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఆయా గ్రామాల వారిగా ఆస్తి పన్ను వివరాలను ఈ వెబ్‌సైట్‌లో చేర్చారు. ఈ వెబ్‌సైట్‌ లో ని వివరాల ఆధారంగా డిమాండ్‌, కలెక్షన్‌, బ్యాలెన్స్‌ (డీసీబీ) పత్రాలను ప్రింట్‌ తీసి ఈఓపీఆర్‌డీలు కార్యదర్శులకు అందజేస్తున్నారు. ఈ ఏడాది లో కొత్తగా ఇళ్ల, ఫ్యాక్టరీల నిర్మాణాలు జరిగి ఉంటే వాటి కొలతలు తీసు కొని అదే విధంగా కొత్త దుకాణాల లైసెన్స్‌ ఫీజు వివరాలను రికార్డులలో పొందుపర్చి ఇస్తున్నారు. అయితే పన్ను వసూలు చేసిన రశీదుల ఆధారం గా వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన టీఎస్‌ ఈ-పంచాయతీల వెబ్‌ లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా పన్ను వసూళ్ల వివరాలు ఎప్పటిక ప్పుడు తెలుసుకోవచ్చు.

అన్ని వర్గాల సహకారాలతోనే...

- దేవరాజు, జిల్లా పంచాయతీ అధికారి, జగిత్యాల

జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీలలో వంద శాతం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఇప్పటికే అధికారులు, ఉద్యో గులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారాలతో 98 శాతం లక్ష్యం పూర్తి చేశాము. రానున్న కొద్ది రోజుల్లో వంద శాతం పూర్తి చేయ డానికి నిర్ణయం తీసుకున్నాము.

Updated Date - Apr 03 , 2024 | 01:11 AM