Share News

ముగిసిన నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:09 AM

పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి నామినేషన్ల పర్వం ముగిసింది.

ముగిసిన నామినేషన్ల పర్వం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అదేరోజు నుంచి నామినేషన్లు దాఖలు ప్రారంభం అయ్యాయి. మున్నెన్నడూ లేని విధంగా ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులు ఆసక్తికనబరిచారు. రాష్ట్రంలోని 17 పార్ల మెంట్‌ స్థానాల్లో పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజక వర్గానికి నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 63 మంది అభ్యర్థులు 109 సెట్లలో నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు మినహా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ, భారత రాష్ట్ర సమితి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, భారతీయ జనతా పార్టీ నుంచి గొమాసే శ్రీనివాస్‌తో పాటు సీనియర్‌ నాయకుడు సోగాల శ్రీనివాస్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా డెమోక్రటిక్‌, ధర్మ సమాజ్‌ పార్టీ, అలియన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, సోషలిస్టు పార్టీ ఇండియా, యువ తరం పార్టీ, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, రాష్ట్రీయ మానవ పార్టీ, బహుజన ముక్త్‌ పార్టీ, మన తెలం గాణ రాష్ట్ర సమైక్య పార్టీల నుంచి అభ్యర్థులతో పాటు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన అభ్యర్థులు బీ ఫారాలను సమర్పించారు. బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌కు బదులు మరొక అభ్యర్థిని బరిలో నిలిపి అతడికి బీ ఫారం ఇస్తారని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు గొమాసే శ్రీనివాస్‌కు బీ ఫారం అందజేశారు. అయితే సబ్‌స్ట్యూట్‌ అభ్యర్థి సోగాల కుమార్‌ పేరును ఆ పార్టీ బీ ఫారంలో చేర్చింది. ఏదేని సాంకేతిక కారణాల వల్ల గొమాసే శ్రీనివాస్‌ నామినేషన్‌ పత్రాలు పరిశీలనలో కొట్టుడు పోతే ఎస్‌ కుమార్‌ బరిలో ఉండే విధంగా బీ ఫారం లో ఆయన పేరును చేర్చారు. చివరిరోజు చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం 3 గంటలలోపు కలెక్టరేట్‌ లోపలికి అనుమతించి ఆ వెంటనే గేటు మూసి వేశారు. ఒక్క నిమిషం ఆలస్యంగా కరీంనగర్‌కు చెం దిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకుడు మాతంగి హన్మయ్య ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి నామినేషన్‌ వేసేందుకు వచ్చారు. కాళ్లు మొక్క బోయినా కూడా సమయం అయిపోయిందని ఎన్ని కల విధులు నిర్వహిస్తున్న పెద్దపల్లి తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ లోపలికి అనుమ తించలేదు. ఐదు నిమిషాలు ఆలస్యంగా బెల్లంపల్లికి చెందిన డాక్టర్‌ దాసరి శ్రీకాంత్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేం దుకు రాగా, ఆయనను కూడా లోపలికి అను మతించలేదు. గడువులోపు వచ్చిన అభ్యర్థుల్లో కొందరు తమ నామినేషన్‌ ప్రక్రియ ముగిసే వరకు రాత్రి 9 గంటల వరకు కలెక్టరేట్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది.

Updated Date - Apr 26 , 2024 | 12:09 AM