Share News

సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన ఎన్‌డీఎస్‌ఏ టీం

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:40 AM

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో భాగంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజీని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం శుక్రవారం సాయంత్రం పరిశీలించింది.

సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన ఎన్‌డీఎస్‌ఏ టీం

మంథని/మంథనిరూరల్‌, మార్చి 8: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో భాగంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజీని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం శుక్రవారం సాయంత్రం పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతి న్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అధ్యయనం చేయటానికి సీడబ్ల్యూ సీ మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం ఉదయం సుందిళ్ల బ్యారేజీకి కింది భాగంలోగల భూపాలపల్లి జిల్లా పరిధిలోని అన్నారం బ్యారేజీని పరిశీలించిన అనంతరం మధ్యా హ్నం 2గంటలకు మండలంలోని సిరిపురం సమీపంలోని సుందిళ్ళ బ్యారే జీని సందర్శించి ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రత్యేక వాహనాల్లో సుందిళ్ల బ్యారేజ్‌ వద్దకు చేరుకున్న ఎన్‌డీఎస్‌ఏ టీం బ్యారేజీ సమీపంలోని క్యాంపు ఆఫీసులో భోజనంచేశారు. అనంతరం బ్యారేజీకి సంబంధించిన ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమై పలు అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. 2022లో కురిసిన భారీవర్షాలు వచ్చినప్పుడు బ్యారేజీకి ఎంత వరద వ చ్చింది, అప్పుడు ఎన్ని గేట్లు తెరిచారు, బ్యారేజీకి కుడి వైపుగల సెఫ్టీ వాల్‌పై నీళ్లు ఎందుకు వచ్చాయి, తదితర అంశాల గురించి తెలుసుకు న్నారు. అలాగే 2023వర్షాకాలం సీజన్‌లో శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీ నుం చి దిగువకు అత్యధికంగా వదిలి పెట్టిన వరద నీరు ఎంత, క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి వచ్చిన వరద నీరు ఎంత, ఆ సమయంలో బ్యారేజీ గేట్ల ను క్రమంగా తెరిచారా? లేక ఓపెన్‌ బ్యారేజీ ఫ్రీ చేశారా? అని సంబంధి త అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది అతఽ్యధికంగా 9 లక్ష ల క్యూసెక్కుల వరకు వరద వచ్చిందని, అప్పుడు గేట్లన్నీ పూర్తిగా తెరిచి ఓపెన్‌ ఫ్రీగా ఉంచామని నీటి పారుదల శాఖాధికారులు ఎన్‌డీఎస్‌ఏ బృందానికి వివరించినట్లు సమాచారం. 2022లో వచ్చిన వరద ఉధృతిని పరిగణనలోకి తీసుకుని 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటి నుంచే బ్యారేజీ ఓపెన్‌ ఫ్రీ పెట్టామని చెప్పారని సమాచారం. అనంతరం బ్యారేజ్‌ కి సంబంధించిన ఫొటో ప్రదర్శనను టీం తిలకించారు. బ్యారేజీ కింద ఉన్న పిల్లర్ల వద్దకు చేరుకున్న బృందం 33, 46, 47, 48, 49,50 పిల్లర్లను, గేట్లను ప్రత్యేకంగా పరిశీలించారు.ఎక్కడైనా పిల్లర్లు పగుళ్లు బారాయా, గేట్ల పైన ఏమైనా పగుళ్లు ఉన్నాయా, పిల్లర్ల కింద ఉన్న బేస్‌ను పరిశీలిం చారు. పిల్లర్ల గోడలను కొద్దిగా తవ్వి పరిశీలించారు.బ్యారేజీ గేట్ల ముందు కింద కోతకు గురికాకుండా వేసిన రాఫ్ట్‌లను పరిశీలించారు.వాటిలో కొన్ని కుంగినట్లుగా గుర్తించారు. అనంతరం వాహనాల్లో బ్యారేజీ పైకి వచ్చి కింద నిల్వ ఉన్న నీళ్లను పరిశీలించారు. బ్యారేజీ పైన సుందిళ్ల బ్యారేజీకి సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. అనంతరం ఎన్‌డీఎస్‌ఏ టీం సాయంత్రం 5-15 గంటల సమయంలో బ్యారేజీ వద్ద నుంచి వెళ్లిపోయా రు. డ్యామ్‌ సేఫ్టీకి సంబంధించి వారు పరిశీలించిన వివరాలను, అంశాల ను మీడియాకు వెల్లడించడానికి అధికారుల బృందం నిరాకరించింది.

Updated Date - Mar 09 , 2024 | 12:40 AM