Share News

జైపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:46 AM

మంచిర్యాల జిల్లా జైపూర్‌ సింగరేణి థర్మ ల్‌ విద్యుత్‌ కేంద్రంకు జాతీయ స్థాయి వాటర్‌ ఎఫిషియంట్‌ యూనిట్‌ అవార్డు అందుకుంది.

జైపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు

గోదావరిఖని, మార్చి 8: మంచిర్యాల జిల్లా జైపూర్‌ సింగరేణి థర్మ ల్‌ విద్యుత్‌ కేంద్రంకు జాతీయ స్థాయి వాటర్‌ ఎఫిషియంట్‌ యూనిట్‌ అవార్డు అందుకుంది. జాతీయ స్థాయిలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సింగరేణి విద్యుత్‌ కేంద్రం అత్యల్పంగా నీటి వియోగిం చినందుకు గాను ఈ అవార్డు లభించింది. గురువారం రాత్రి ఢిల్లీలో కౌన్సిల్‌ ఆఫ్‌ ఎన్విరో ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో ఈ అవార్డును సింగరేణి విద్యుత్‌ కేంద్రం అధికారులు చంద్రలింగం, ఎల్‌జేవీ సుబ్బారావు అందుకున్నారు. జాతీయ స్థాయిలో 500 మెగావాట్ల పైబడిన సామర్థ్యం గల సుమారు 150 ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యుత్‌ కేంద్రాల్లో సింగరేణికి ఈ అవార్డు లభించింది. ఈ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఒక గంట సమయంలో ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి గరిష్టంగా 3ఘనపు మీటర్ల నీటిని వినియోగించడాన్ని ఒక ప్రమాణికంగా సెంట్రల్‌ ఎలక్ర్టిసిటీ వారు సూచిస్తారని, సాధారణంగా థర్మల్‌ విద్యు త్‌ కేంద్రాల్లో ఈ ప్రమాణాన్ని దాటే నీటి వినియోగం ఉంటుందని, సింగరేణి విద్యుత్‌ థర్మల్‌ కేంద్రం 2.8ఘనపు మీటర్ల నీటి వినియో గంతోనే ఒక గంట సమయంలో ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. అతి తక్కువ నీటిని వినియోగించడం కోసం సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుం దని, హైడ్రోబిన్‌ సిస్టం వినియోగించడం వల్ల నీటి వినియోగం తక్కు వగా ఉంటుందని, జీరో లిక్విడ్‌ డిశ్చార్జి వ్యవస్థలను కూడా నిర్వహిం చడం వల్ల ప్లాంట్‌లో వివిధ విభాగాల నుంచి బయటకు విడుదల అవుతున్న అపరిశుభ్రమైన నీటిని సైతం పూర్తిస్థాయిలో శుద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే ఫ్లైయాష్‌ను కూడా ఎప్పటికప్పుడు బయటకు రవాణా చేయడం వల్ల నీటిని పొదుపు చేయడం జరుగుతుందన్నారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో తీసుకుంటున్న పర్యావరణ హిత చర్యలకు ఇప్పటికే పలు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. రూ.696కోట్లతో ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి బెస్ట్‌ నేషనల్‌ వాటర్‌ ఎఫిషియంట్‌ యూనిట్‌ అవార్డు రావడం పట్ల సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌, డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 09 , 2024 | 12:46 AM