Share News

మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:16 AM

మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. గురువారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వేడుకలను నిర్వహించారు.

మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యం
కలెక్టర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యేలు, తదితరులు

- ఎమ్మెల్యేలు డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌

జగిత్యాల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. గురువారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాతో పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా అదికారులను శాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడా రు. మహిళా సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దివాకర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి, రాయికల్‌ జడ్పీటీసీ సభ్యురాలు అశ్విని, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, మహిళా ఉద్యోగినిలు పాల్గొన్నారు.

- జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్‌ హాలులో గురువారం జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి ఆధ్వర్యంలో మహిళా కౌన్సిలర్లతో పాటు ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయ లక్ష్మి, మెప్మా ఏవో శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

- మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి..

మహిళలు చట్టాలపై అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి హాజరై కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. మహిళలు తమ హక్కులను గుర్తించి సామాజిక మార్పుపై ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రసాద్‌, వినీల్‌ కుమార్‌, శ్రీనిజ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్‌ రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:16 AM