Share News

నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:12 AM

నూతన చట్టాలపై న్యాయవాదులకు అవగాహ న కలిగి ఉండాలని అదనపు జిల్లా న్యాయమూర్తి టీ శ్రీనివాసరావు అన్నారు.

నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

కోల్‌సిటీ, జూలై 11: నూతన చట్టాలపై న్యాయవాదులకు అవగాహ న కలిగి ఉండాలని అదనపు జిల్లా న్యాయమూర్తి టీ శ్రీనివాసరావు అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి రాపోలు భాస్కర్‌ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం న్యాయవాదులకు నూతన చట్టాలపై రూపొందించిన పుస్త కాలను గురువారం బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర్చుకున్న విద్యను ప్రతి ఒక్కరికి పంచాలని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన చట్టాలపై ప్రతి న్యాయవాది అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం న్యాయవాదులకు ఉచితంగా పుస్తకాలను అందజేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తౌటం సతీష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్‌జడ్జి శ్రీనివాసులు, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మంజుల, రెండవ అదనపు న్యాయమూర్తి వెంకటేష్‌, బార్‌ అసోసియే షన్‌ ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్‌, సభ్యులు గోషిక ప్రకాష్‌, ప్రవీ ణ్‌, మహేందర్‌, సంతోష్‌, వరలక్ష్మి, రమ్య, దూడపాక లింగయ్య, మ హేందర్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 12:13 AM