మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారుల సమావేశం
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:36 AM
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సహరిహద్దు జిల్లాల పోలీస్ అధికారుల సమావేశం గురువా రం గడ్చిరోలి ఎస్‌పీ క్యాంపు కార్యాలయంలో జరిగింది.

కోల్‌సిటీ, అక్టోబరు 24: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సహరిహద్దు జిల్లాల పోలీస్ అధికారుల సమావేశం గురువా రం గడ్చిరోలి ఎస్‌పీ క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమా వేశానికి రామగుండం పోలీస్ కమిషనర్, ఐజీ శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా రామగుండం నుంచి హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు. శ్రీనివాస్ సమావే శానికి అధ్యక్షత వహించగా గడ్చిరోలి డీఐజీ అంకిత్ గోయల్, సీఆర్‌పీఎఫ్(ఆపరేషన్స్) డీఐజీ అజయ్ శర్మ, కనికెర్ ఎస్‌పీ కళ్యాణ్, ఎలెసెల, మోహాల మణ్‌పూర్ ఎస్‌పీ వైపీ సింగ్, గడ్చిరోలి ఎస్‌పీ నిలో త్పల్, బాంద్ర ఎస్‌పీ నూరుల్ హసన్, చంద్రపూర్ ఎస్‌పీ ముమ్మక్క సుదర్శన్, గోండియా ఎస్‌పీ గోరక్ భమ్రే, భూపాల్‌పల్లి ఎస్‌పీ కిరణ్‌కారే, ఆసిఫాబాద్ ఎస్‌పీ శ్రీనివాస్‌లు, నారాయణపూర్ అడిషనల్ ఎస్‌పీ రాబిన్‌సన్, బీజాపూర్ అడిషనల్ ఎస్‌పీ దినేష్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మావోయిస్టు కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, పరస్పర సమాచారం మార్పిడి చేసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికలు ప్రశాంత వాతావ రణంలో సజావుగా నిర్వహించేందుకు మూడు రాష్ట్రాల అధికారులు పరస్పర సహకరంతో మెదలాలని నిర్ణయించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు జరుపాలని, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల సరిహద్దు ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఎన్‌బీడబ్ల్యూ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారులు సమాచార మార్పిడి చేసుకో వాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావే శంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, గడ్చిరోలి ఎస్‌పీ(అడ్మిన్) రమేష్, ఆపరేషన్ డీఎస్‌పీ విశాల్‌నాగార్ గోగె, రామగుండం ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావుతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌కు చెందిన పలు జి ల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.