Share News

గ్రంథాలయాల ఆధునికీకరణకు చర్యలు

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:00 AM

జిల్లాలోని గ్రంథాలయాల ఆధు నికీకరణకు కృషి చేస్తామని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌ అన్నారు.

గ్రంథాలయాల ఆధునికీకరణకు చర్యలు

సుల్తానాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రంథాలయాల ఆధు నికీకరణకు కృషి చేస్తామని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌ అన్నారు. మండలంలోని గర్రెపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని సుల్తానా బాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావుతో కలిసి ఆయన బుధవా రం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి శ్రీదర్‌బాబు, ఎమ్మెల్యేల సహకారం ప్రోత్సాహంతో జిల్లాలోని అన్ని లైబ్రరీలను ఆదునికీకరి స్తామన్నారు. యువతకు ముఖ్యంగా నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు అవసర మైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. లైబ్రరీల్లోని పుస్తకాలను డిజిటలైజ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, పాఠకులకు తగిన వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అన్ని లైబ్రరీలకు స్వంత భవనాలు నిర్మించాలనే ఆలోచన ఉందని, ముందుగా జిల్లాకేంద్రంలో స్వంత భవన నిర్మాణం చేపడు తామని, ఆరు కోట్ల రూపాయలతో భవన సముదాయం నిర్మించేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో సుల్తానాబాద్‌, మంథనిల్లో మాత్రమే స్వంత భవనాలున్నాయని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు మున్సిపాలి టీలు, గ్రామ పంచాయతీల నుంచి దాదాపు నాలుగు కోట్ల లైబ్రరీ సెస్‌ నిధులు రావాల్సి ఉందని, వాటి వసూలుకు కృషి చేస్తూ వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఎంపీటీసీలు సత్యనారాయణరావు, బొల్లం లక్ష్మణ్‌, పులి వెంకటేశంగౌడ్‌, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ కల్లెపల్లి జానీ, మాదా సు వెంకన్న పటేల్‌, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, సహకార సంఘం వైస్‌చైర్మన్‌ దీకొండ శ్రీనివాస్‌, చక్రపాణి పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 01:00 AM