Share News

పీహెచ్‌సీలో ప్రసూతి వైద్యసేవలు మెరుగుపర్చాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:32 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పీహెచ్‌సీలో ప్రసూతి వైద్యసేవలు మెరుగుపర్చాలి
పీహెచ్‌సీలో ఓపీ రికార్డు తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

- కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌

- ఆసుపత్రి, తహసీల్దార్‌ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

- నర్సరీ, డ్రైనేజీ పరిశీలన

కొడిమ్యాల, జూలై 4: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ సేవలు, ఆన్‌లైన్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు. డాక్టర్లు సమయపాలన పాలించాలని, ఒక రోజులో ఓపీ ఎంత మందిని పరిక్షీస్తున్నారని అడిగారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వైద్యసేవలు అందించాలన్నారు. ల్యాబ్‌ విభాగాన్ని తనిఖీ చేసి టీ హబ్‌కు పంపే డయాగ్నస్టిక్‌ రికార్డును పరిశీలించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మురికినీరు నిల్వలేకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు బస్టాండ్‌ సమీపంలోని మురికి నీటికాల్వను పరిశీలించి, నర్సరీని పరిశీలించి ఏ రకమైన మొక్కలు ఉన్నాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి రాకుండ తగిన జాగ్రత్తలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో మధుసూదన్‌, డీఎంహెచ్‌వో సమీయొద్దీన్‌, డీపీవో స్వామి, మండల ప్రత్యేక అఽధికారి ప్రతాప్‌సింగ్‌, ఎంపీడీవో స్వరూప, తహసీల్దార్‌ రాజమణి, మెడికల్‌ ఆఫీసర్‌ పరమేశ్వరీ, ఏపీవో సతీష్‌, ఎంపీవో వాసవి, ఆర్‌ఐ కర్ణాకర్‌, కార్యదర్శి వంశీవర్దన్‌, సీహెచ్‌వో రాజశేఖర్‌, వివిద శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:32 AM