ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్‌సింగ్
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:16 AM
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆర్థి క వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోన్‌సింగ్ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు.

కళ్యాణ్‌నగర్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆర్థి క వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోన్‌సింగ్ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్‌సింగ్ అంచెలంచెలుగా ఎదిగి రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా పనిచేసి దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపా రన్నారు. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్‌సింగ్ ఆర్థిక మంత్రిగా దేశఆర్థిక చరిత్రను మలుపతిప్పి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. చంద్రశేఖర్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశం లోని బంగారు సంపదను ఇతర దేశాలకు తాకట్టు పెట్టారని, ఆర్థిక మంత్రిగా మన్మో హన్‌సింగ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తాకట్టు పెట్టిన బంగారు సంపదను తిరిగి దేశానికి తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో మేయర్ బంగి అనీల్‌కుమార్, కార్పొరే టర్లు మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, నాయకులు, కాల్వ లింగస్వామి, తిప్పా రపు శ్రీనివాస్, నాయిని ఓదెలు, బొమ్మక రాజేష్, కళ్యాణి సింహాచలం, పెద్దల్లి ప్రకాష్, పాతిపెల్లి ఎల్లయ్య, పెండ్యాల మహేష్, కొప్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.