వైభవంగా జగన్నాథ రథయాత్ర...
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:56 PM
ఇస్కాన్ మందిరం కరీంనగర్, జగన్నాథ రథయాత్ర కమిటీ, ప్రజ్ఞాభారతి సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్‌లో జగన్నాథ రథయాత్రను సోమవారం వైభవంగా నిర్వహించారు. వర్షం కురిసినా తడుస్తూ వందలాది మంది రథాన్ని లాగుతూ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. రాంనగర్ రమాసత్యనారాయణస్వామి ఆలయం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు పూజలు చేశారు. పూరీ యాత్ర మాదిరి రథం ముందు శుభ్రం చేశారు. గీతా భక్త సమాజం అధ్యక్షుడు బండ సత్తయ్య ఆధ్వర్యంలో వుప్పల రామేశం, చిట్టుమల్ల దామోదర్, చిన్న వేంకటయ్య, సభ్యులు సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు.
కరీంనగర్ కల్చరల్, జూలై 15: ఇస్కాన్ మందిరం కరీంనగర్, జగన్నాథ రథయాత్ర కమిటీ, ప్రజ్ఞాభారతి సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్‌లో జగన్నాథ రథయాత్రను సోమవారం వైభవంగా నిర్వహించారు. వర్షం కురిసినా తడుస్తూ వందలాది మంది రథాన్ని లాగుతూ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. రాంనగర్ రమాసత్యనారాయణస్వామి ఆలయం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు పూజలు చేశారు. పూరీ యాత్ర మాదిరి రథం ముందు శుభ్రం చేశారు. గీతా భక్త సమాజం అధ్యక్షుడు బండ సత్తయ్య ఆధ్వర్యంలో వుప్పల రామేశం, చిట్టుమల్ల దామోదర్, చిన్న వేంకటయ్య, సభ్యులు సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. కార్యక్రమంలో మయూరగిరి పీఠాధిపతి నమిలకొండ రమణాచార్యస్వామి పాల్గొన్నారు. మంకమ్మతోట, రాంనగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం బాధ్యులు పండ్లు, మంచినీరు వితరణ చేశారు. దారి పొడవునా వేషధారణలు, భజనలు, కోలాటాలు, నృత్యాలు, ఒగ్గుడోలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్‌దేశాయ్, ఆర్డీవో కుందారపు మహేశ్వర్, యాత్ర చైర్మన్ కన్న కృష్ణ, కో చైర్మన్లు తుమ్మల రమేశ్‌రెడ్డి, కోమాళ్ల రాజేందర్‌రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి, ప్రజ్ఞాభారతి ప్రతినిధి డాక్టర్ ఎల్ రాజభాస్కరరెడ్డి, మందల నగేశ్‌రెడ్డి, నంది శ్రీనివాస్, గసికంటి జనార్దన్‌రెడ్డి, పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు, గర్రెపల్లి మహేశ్వరశర్మ పాల్గొన్నారు.