Share News

కలెక్టరేట్‌ ఎదుట మధ్యాహ్న భోజనం కార్మికుల ధర్నా

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:47 AM

మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళ వారం కలెక్టర్‌ ఎదుట ధర్నా చేపట్టారు.

కలెక్టరేట్‌ ఎదుట మధ్యాహ్న భోజనం కార్మికుల ధర్నా

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 11: మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళ వారం కలెక్టర్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసంద ర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానం దం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌, మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి పూసల రమేష్‌ మాట్లాడు తూ నాలుగు నెలల పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, మధ్యాహ్నం భోజన కార్మికులకు స మాన పనికి సమాన వేతనం అమలు చేయాల ని, కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాల మాదిరిగా కార్మికుల ఇ బ్బందులకు గురిచేయవద్దని సూచించారు. మ ధ్యాహ్న భోజనం పర్యవేక్షణ మహిళా సంఘాల కు అప్పచెబుతున్నామని ప్రభుత్వం ప్రకటించ డం సరికాదన్నారు. వంట చేస్తున్న కార్మికులు మహిళా గ్రూపులో మహిళా సంఘాల వాళ్లేనని ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం స్వామి, గట్టయ్య వసంత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:47 AM