Share News

రుణ మాఫీ సర్వేలో ముందంజ

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:58 AM

అన్ని అర్హతలున్నప్పటికీ రేష న్‌కార్డు లేని కారణంగా రుణమాఫీ కానీ రైతుల కుటుంబాల నిర్ధారణ (ఫ్యామిలీ గ్రూపింగ్‌) ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా చురుకుగా కొనసాగు తోంది.

రుణ మాఫీ సర్వేలో ముందంజ

జగిత్యాల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అన్ని అర్హతలున్నప్పటికీ రేష న్‌కార్డు లేని కారణంగా రుణమాఫీ కానీ రైతుల కుటుంబాల నిర్ధారణ (ఫ్యామిలీ గ్రూపింగ్‌) ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా చురుకుగా కొనసాగు తోంది. రాష్ట్రంలోనే రుణ మాఫీ సర్వేలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతా ల్లో మండల వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ఆయా రైతుల కుటుంబాలను నిర్థారణ చేస్తున్నారు. ఇందుకోసం సదరు రైతు కుటుంబ సభ్యులంతా కలిసి ఓ సెల్ఫీ ఫొటో దిగాల్సి ఉంటోంది. ఈ ఫొటోను అధి కారులు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అలాగే కుటుంబసభ్యుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను కూడా రైతుల నుంచి తీసుకుంటున్నారు. ఈ అఫిడవిట్‌ను కూడా అప్‌లో డ్‌ చేస్తున్నారు. ఈ ఫొటోలో కుటుంబ సభ్యులంతా ఉండాలి. లేని పక్షం లో కనీసం కుటుంబపెద్ద తప్పనిసరి చేశారు. రైతు కుటుంబ పెద్దలు చా లా మంది స్థానికంగా ఉంటలేరు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు తమ గ్రామానికి వచ్చి ఈ సెల్ఫీలు, అఫిడవిట్‌లు ఇవ్వాల్సి వస్తోంది. ఈ ప్రక్రి యను మండల వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లి చేపడుతున్నారు.

జిల్లాలో లక్ష్యం 12,620...

జిల్లా వ్యాప్తంగా ఫ్యామిలీ గ్రూపింగ్‌ చేయాల్సిన లక్ష్యం 12,620 కాగా ఈనెల 11వ తేదీ వరకు 10,222 కుటుంబాల గ్రూపింగ్‌ను వ్యవసాయ అ ధికారులు పూర్తి చేశారు. మిగిలిన 2,398 ఫ్యామిలీ గ్రూపింగ్‌ను సాధ్య మైనంత తొందరలో పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా ఫ్యామిలీ గ్రూపింగ్‌ లక్ష్యం ఎక్కువగా ఉన్నప్పటికీ వేగవంతంగా సర్వేను పూర్తి చేస్తూ రాష్ట్రం లో ప్రథమ స్థానంలో జిల్లాను అగ్రభాగాన నిలిపామని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి.

పాతిక శాతం మందికి కాని రుణమాపీ...

రాష్ట్ర పభుత్వం రైతుల పంట రుణాలను మాఫీని ప్రతిష్టాత్మకంగా చే పట్టిన విషయం విదితమే. ఒక్కో రైతు కుటుంబంలో రూ. 2 లక్షల మేర కు పంట రుణాలను మాఫీ చేస్తోంది. రూ. లక్ష లోపు పంట రుణ మున్న రైతులకు తొలి విడతలో, రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర లోపు రుణమున్న రైతుల రుణాలను రెండో విడతలో, రూ. లక్షన్నర నుంచి రూ. రెండు లక్ష లోపు ఉన్న పంట రుణాలను మూడో విడతలో మాఫీ చేసింది. అనేక కా రణాల వల్ల జిల్లాలో వేలాది మంది రైతుల పంట రుణాలు మాఫీ కాలే దు. మాఫీ వర్తించని సుమారు 35కు పైగా కారణాల్లో ఈ రేషన్‌ కార్డు లేని కారణంగా వందలా మంది రైతులకు మాఫీ వర్తించలేదు. ఇలా కు టుంబ నిర్థారణ కాని రైతు కుటుంబాల నిర్థారణ ప్రక్రియ ఇప్పుడు కొన సాగుతోంది. ఇలా కుటుంబ నిర్థారణ జరగని రైతుల జాబితాను వ్యవసా యశాఖ బ్యాంకర్ల నుంచి సేకరించి మండల వ్యవసాయ అధికారులకు పంపింది. ఈ జాబితా ప్రకారం ఈ కుటుంబ నిర్థారణ ప్రక్రియ కొనసాగుతోంది.

కుటుంబ పెద్ద విదేశాల్లో ఉంటే...

చాలా మంది రైతు కుటుంబాల్లోని కుటుంబపెద్దలు విదేశాల్లో ఉన్నా రు. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ తమ భూముల్లో వ్యవసాయం చేసు కుంటున్నారు. ఇలా విదేశాల్లో ఉన్న రైతులకు సంబంధించిన వారి వివ రాల జోలికి అధికారులు వెళ్లడం లేదు. ఈ జాబితాను ప్రస్తుతం పక్క న బెట్టారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి నగరాల్లో ఉం టున్న రైతు కుటుంబ పెద్దలు తమ స్వగ్రామాలకు వచ్చి సెల్ఫీ ఫొటోలు దిగి, అఫిడవిట్‌లు ఇస్తున్నారు. పక్షం రోజులుగా ఈ నిర్థారణ కొనసా గుతోంది. నిర్ణీత షెడ్యూల్‌ మేరకు గ్రామాలకు వెళ్లి ఈ ప్రక్రియను చేస్తు న్నారు. ఈ నెల 6వ తేదీ వరకు ఈ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నా యి. కానీ ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో గడువు ప్రభుత్వం పొడిగించింది.

రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నాం

- వాణి, జిల్లా వ్యవసాయ అధికారిణి

అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ కాని రైతులకు సంబందించి ఫ్యామిలీ గ్రూపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే సుమారు ముప్పాతిక శాతానికి మించి ఈ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన దరఖా స్తులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. ప్రత్యేక యాప్‌లో ఈ వివరాలను నమోదు చేస్తున్నాం. ఫ్యామిలీ గ్రూపింగ్‌ ప్రక్రియలో రాష్ట్రం లోనే ముందంజలో ఉన్నాము.

Updated Date - Sep 13 , 2024 | 12:58 AM