గ్రంథాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:32 AM
గ్రంథాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుడు ఏవీఎన్ రాజు అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. విద్యార్థులు, పాఠకులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కరీంనగర్ కల్చరల్, జూలై 7: గ్రంథాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుడు ఏవీఎన్ రాజు అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. విద్యార్థులు, పాఠకులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా చల్లటి, వేడి నీరు వచ్చే ఓల్టాస్ యంత్రాలను వెంటటనే కొనుగోలు చేయాలని కార్యదర్శికి ఆదేశాలిచ్చామని తెలిపారు. పోటీ, మోడల్ పరీక్షల నిర్వహణ, వసతుల ఏర్పాట్లు, సిబ్బంది సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు తామెంచుకున్న కోర్సుల్లో విజయం సాధించాలంటే కఠోరంగా శ్రమించాలన్నారు. పాఠకులు, విద్యార్థులు అడిగిన పుస్తకాలను సిబ్బంది అందుబాటులో ఉంచాలని, విలువైన మరిన్ని పుస్తకాలను తెప్పించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది జి సరిత, ఎండీ గఫార్, జె గౌతమి, తిరుపతి, సుమన్, పవన్, శశి, రిటైర్డ్ ఉద్యోగి నాంపల్లి పాల్గొన్నారు.