చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jul 17 , 2024 | 12:34 AM
బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 18న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు విజ యవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐ టీయూ) డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాగరాజు గోపాల్ పిలుపునిచ్చారు.
యైుటింక్లయిన్‌కాలనీ, జూలై 16: బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 18న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు విజ యవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐ టీయూ) డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాగరాజు గోపాల్ పిలుపునిచ్చారు. మంగవారం ఓసీపీ-3 కృషి భవన్‌లో జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సంస్థను పరిరక్షించుకోవాలని నెల రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయని, అన్ని సంఘా లు 18న చలో హైదరాబాద్ ఆందోళనకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రానికి తలమానికమైన సింగరేణిని నిర్వీర్యం చేసేలా ఉన్న వేలం ప్రక్రియను సమష్టి పోరాటాల ద్వారా నిలువరిద్దామని పిలుపునిచ్చా రు. ప్రభుత్వరంగ సంస్థగా ఉన్నందునే గడిచిన పదేళ్ళలో సింగరేణి నుండి పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 49 వేల కోట్లు ఆదాయం సమకూరిందని అన్నారు. మరో పదేళ్ళలో సంస్థలోని బొగ్గు నిల్వలు ఖాళీ అవనున్నాయని, ఇపుడు గనులు కేటాయించనుంటే సింగరేణి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని నాగరాజు గోపాల్ అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అన్వేషించిన గనులు సైతం వేలం జాబితాలో చేర్చడం అన్యాయమని పేర్కొన్నారు. ఇది కేవలం సింగరేణి సమస్య కాదని, నిరుద్యోగ, ప్రభావిత ప్రాంతాలతో లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే అంశమని అభిప్రాయప డ్డారు. కార్మికుల ఆందోళనలకు అన్ని ప్రజా సంఘాలు మేధావులు మద్ద తుగా నిలవాల్ని అవరం ఉన్నదని నాగరాజు గోపాల్ పేర్కొన్నారు. ఇటీ వల ప్రవేశపెట్టిన ఎల్లో కార్డు, రెడ్ కార్డుల విధానం లోపభూయిష్టమైన దని, వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గేట్ మీటింగ్‌లో ఆర్జీ-2 సెక్రెటరీ కుంట ప్రవీణ్, ప్రెసిడెంట్ వినయ్, నాయ కులు సారంగం, సంపత్, రాంప్రసాద్, నరసింహ, లక్ష్మీరాజం, భూమ య్య, లింగయ్య పాల్గొన్నారు.