Share News

బీఆర్‌ఎస్‌ గెలుపునకు సమష్టిగా పోరాడుదాం

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:00 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పోరాడి విజయం సాధించేలా ముందుకు సాగుదామని పెద్దపల్లి బీఆర్‌ ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ గెలుపునకు సమష్టిగా పోరాడుదాం

కమాన్‌పూర్‌, మంథని, ముత్తారం, రామగిరి, మార్చి 17 : పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పోరాడి విజయం సాధించేలా ముందుకు సాగుదామని పెద్దపల్లి బీఆర్‌ ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం మంథని నియోజకవర్గ పరిధిలోని కమాన్‌పూర్‌, మంథని, ముత్తారం, రామగిరి మండలాల నాయకులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆచరణకు సాద్యం కాని హామీలను కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చిందని ఆరోపించారు. వందరోజులు గడిచిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశామలంగా ఉండేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కరువు, కాటకాలతో దర్శనమి స్తుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపుతో కాంగ్రెస్‌ పార్టీలో ఉణుకు పుట్టాలన్నారు.అనంతరం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జీ పుట్ట మధుకర్‌ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా అబద్దాలతో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తుందన్నారు. తప్పుడు హామీ లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ గెలుపుతో బుద్ది చెప్పాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్‌గౌడ్‌, ఎంపీపీ జక్కుల ముత్తయ్య, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు పోతుపెద్ది కిషన్‌రెడ్డి, మండల రైతుబంధు కన్వీనర్‌ అత్తె చంద్రమౌళి, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నూనేకుమార్‌ పోతుపెద్ది రమణరెడ్డి, మహిళా అధ్యక్షురాలు పప్పు స్వరుప, రామగిరి జడ్పీటీసీ శారద కుమార్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శంకేసి రవీందర్‌, ఇనగంటి రామారావు, కోలేటి చంద్రశేఖర్‌, నీలం సరిత, పలువురు నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:00 AM