Share News

ఇక పంచాయతీ సమరమే...

ABN , Publish Date - May 19 , 2024 | 12:40 AM

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ము గిసి, ఓట్ల లెక్కింపు మిగిలిఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్‌ బాక్సులు సరి చూసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

ఇక పంచాయతీ సమరమే...

- సర్పంచ్‌ ఎన్నికల వైపు...అధికారుల చూపు

- బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు

- ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు

- ఆశావహులు సన్నద్ధం...పల్లెల్లో కోలహాలమే

- జిల్లాలో 380 పంచాయతీలు...3,500 వార్డులు

జగిత్యాల, మే 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ము గిసి, ఓట్ల లెక్కింపు మిగిలిఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్‌ బాక్సులు సరి చూసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. పదవీకాలం ముగిసిన పంచాయతీలతోపాటు ఎన్నిక లు జరగని గ్రామాల్లోనూ వీటి నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారం భించారు. లోక్‌సభ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించగా పంచాయతీ ఎ న్నికలు బ్యాలెట్‌ బాక్సులతో సాగనుంది. పంచాయతీ పాలకవర్గాల పద వీకాలం ఫిబ్రవరి 2న ముగియడంతో ఆ వెంటనే ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. వాస్తవానికి జనవరిలో ఎన్నికల నిర్వహణకు అధి కారులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఉద్యోగుల వివరాలు సేకరించి వదిలి పెట్టారు. తాజాగా బ్యాలెట్‌ బాక్సుల లెక్కలు సరిచూడాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల నుంచి అన్ని జిల్లాల పంచా యతీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్న బ్యాలెట్‌ బాక్సులు తీసుకోవాలని చుట్టుపక్కల ఉన్న కొన్ని జిల్లాలకు అధి కారులు సూచించారు. జగిత్యాల జిల్లాలోని పంచాయతీలకు బ్యాలెట్‌ బా క్సులు సరిపడా ఉన్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. దీంతో పా టు పోలింగ్‌ సిబ్బందికి ఆర్‌వో బుక్‌లు ఏ మేరకు అవసరం అవుతాయో వివరాలు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎన్నికలు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో నిర్వహించనున్నారు. పోలింగ్‌ సిబ్బందితో పా టు ఆర్‌వో బుక్‌లు సైతం ఎక్కువ సంఖ్యలోనే అవసరమవుతాయని అధి కారులు లెక్కలు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 380 గ్రామ పంచాయతీలు, 3,500 వార్డులలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

200 మందికి ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం

ఓటర్ల సౌలభ్యం కోసం 200 ఓటర్ల వరకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏ ర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దీనికోసం ఒక ప్రిసైడింగ్‌ అధికారి, పో లింగ్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుంది. 200 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు సహాయ అధికారులు, 401 మంది ఓటర్ల నుం చి 650 మంది ఓటర్ల వరకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, మరో ముగ్గురు స హాయ అధికారులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తు న్నా రు. జిల్లాలో ఓటర్లకు అనుగుణంగా పోలింగ్‌ సిబ్బంది వివరాలు సేక రిం చారు. ఉద్యోగుల సంఖ్య సరిపోని పరిస్థితి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ లు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, గురుకులాలు, ఎయిడెడ్‌ పాఠశాలలు, ఇత ర సంస్థల సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. ప్రతి వార్డుకు ఒక పో లింగ్‌ కేంద్రం ఉంటుంది. ప్రతి కేంద్రంలో ఒక బ్యాలెట్‌ బాక్సు వార్డు స భ్యుడి ఎంపికకు, మరో బ్యాలెట్‌ బాక్సు సర్పంచి ఎన్నికకు ఏర్పాటు చేస్తా రు. ఇవే లెక్కలు సరిచూసి బ్యాలెట్‌ బాక్సులను అధికారులు అంచనా వే శారు. బాక్సుల కొరత లేకపోవడంతో ఎలాంటి సమస్యలేదని అధికారులు అంటున్నారు. అవసరమైన బ్యాలెట్‌ బాక్సుల సంఖ్యకు తోడు అదనంగా ఇరవై శాతం బాక్కులను అందుబాటులో ఉంచారు.

గ్రామాల్లో కోలాహలమే...

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ముగియగా, ఇక స్థానిక సంస్థల వంతు కావడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొననుంది. వచ్చే నెల 4వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగియనుంది. ఆ త ర్వాత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే పల్లెల్లో సందడి వాతావరణం షురూ కానుంది. సర్పం చుల పదవీకాలం గత ఫిబ్రవరితో ముగిసింది. ఇక మండల, జిల్లా పరిష త్తుల పదవీకాలం జూలై 3వ తేదీతో ముగియనుంది. గ్రామ పంచాయ తీల్లో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. గ్రామపంచా యతీ ఎన్నికలు పార్టీల కతీతంగా కావడంతో ముందుగా వాటిని నిర్వ హిస్తే జిల్లాలో అన్ని పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది. 2019లో మూ డు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. ఇవి పార్టీల గుర్తులతో పోటీ చేయనున్నారు. ఒక వేళ ప్రభుత్వం బీసీ గణన చేపడితే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలను నిర్వహించనుంది. ఇందుకు కొం త సమయం పట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 18 మండలాల్లో ఎన్ని కలు జరిగాయి. కొత్తగా బీమారం, ఎండపల్లి మండలాలు ఏర్పడ్డాయి. అం దువల్ల ఇరవై మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.

మద్దతుకు ప్రయత్నం...

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సమాచారంతో గ్రామాల్లో ఆశావహుల సందడి నెలకొంది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకునే వారు సన్నద్ధమవుతు న్నా రు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయా ల్సి రావడంతో టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అధిష్టా నం, ముఖ్యనాయకులతో టచ్‌లో ఉంటున్నారు. మూడు ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు బరిలో దిగే అవకాశం ఉంది. గతంలో పోటీ చేసి ఓట మి పాలైన వారు, కొత్తగా పోటీ చేయాలనే ఆలోచన ఉన్న నేతలు ఈ ప దవులపై కన్నేసి ఉంచుతున్నారు. అటు గ్రామ పంచాయతీ, ఇటు మం డల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు సమీపిస్తుండడంతో పల్లెల్లో రాజ కీయ సందడి నెలకొంది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..

- దేవరాజు, జిల్లా పంచాయతీ అధికారి, జగిత్యాల

పంచాయతీ ఎన్నికలపై ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు చే యడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే ఇందుకు అవసరమైన పలు సమా చారాలను ప్రాథమికంగా సేకరించాము. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించిన పకడ్బందీగా పూర్తి చేయడానికి అవసర మైన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాము.

Updated Date - May 19 , 2024 | 12:41 AM