క్రోధి నామ సంవత్సరం.. శుభప్రదం
ABN , Publish Date - Apr 10 , 2024 | 12:48 AM
తెలుగు నూతన సంవత్సరాది క్రోధికి జిల్లా ప్రజలు మంగళవారం ఘనంగా స్వాగతం పలికారు. ఊరూరా ఉగాది వేడకలను వైభవంగా నిర్వహించారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): తెలుగు నూతన సంవత్సరాది క్రోధికి జిల్లా ప్రజలు మంగళవారం ఘనంగా స్వాగతం పలికారు. ఊరూరా ఉగాది వేడకలను వైభవంగా నిర్వహించారు. ఆలయాలను ప్రత్యేకంగా అలంక రించారు. ప్రతి ఇంటా మామిడి తోరణాలతో అలంకరించారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. పిండి వంటలు ఘుమఘుమలాడాయి. ఆలయాల్లో భక్తులు ధర్శనాలకు రావడంతో కిటకిటలాడాయి. జిల్లాలోని దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఉగాది పర్వదిన వేడుకలు వైభవంగా సాగాయి. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో అర్చకులు స్వామివారలకు పత్యేక పూజలు చేశారు ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీస్వామివారి కళ్యాణ మంటపంలో పంచాంగ పూజ నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం ఆలయ ఉప ప్రధాన అర్చకుడు చంద్రగిరి శరత్ శర్మ పంచాగం చదివి వినిపించారు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ, లక్ష్మీవేంకటేశ్వర స్వామి, వాసవి కన్యకాపరమేశ్వరీ, హనుమాన్ దేవాలయాల్లో పంచాంగం వినిపించారు. పలు సంస్థల ఆధ్వర్యంలో కవి సమ్మేళనాలు నిర్వహించారు. సిరిసిల్ల మార్కండేయ దేవస్థానంలో క్రోధి నామ సంవత్సరంలో కలిగే ఫలితాలను పంచాంగ శ్రవణం ద్వారా వేద పండితులు వివరించారు. వేద పండితులు కోడూరి రామస్వామి, వడ్డెపల్లి నాగరాజు, హరీష్, విజయ్‌భాస్కర్, కోట లక్ష్మీనర్సయ్యలు రాశిఫలాలను వివరించారు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఫలాలకు సంబంధించినవి పంచాంగ శ్రవణం చేశారు. క్రోధి నామ సంవత్సరంలో మంచి ఫలితాలు ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా పడుతాయని సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు మెరగువుతాయని, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతారని తెలిపారు. పంచాంగ శ్రవణంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, టెక్స్‌టైల్ కార్పొరేషన్‌మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్మన్ అడెపు రవీందర్, పాలిస్టర్ అసోసియేషన్‌అధ్యక్షుడు మండల సత్యం, పద్మశాలి యువజన సంఘంఅధ్యక్షుడు పూర్ణచందర్, కట్టెకోల లక్ష్మీనారాయణ, కోడం శ్రీనివాస్, అశోక్, యెల్లె లక్ష్మీనారాయణ, డాక్టర్ బాలయ్య, శ్రీనివాస్, తార, తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేదపండితులు మాడంరాజు కృష్ణమాచార్యులు, సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో వేద పండితులు శివప్రసాద్ శర్మలు పంచాంగ శ్రవణం చేశారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్, ఇతర దేవాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిదులు పాల్గొన్నారు.