నేర్చుకున్న పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:51 AM
శిక్షణలో నేర్చుకు న్న పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

పెద్దపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): శిక్షణలో నేర్చుకు న్న పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో దేశీ శిక్షణలో భాగంగా డిప్లోమా కోర్సు పూర్తి చేసుకున్న వ్యవసాయ విత్తన, ఎరువుల డీలర్లకు సర్టిఫికెట్లను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48 వారాల పాటు శిక్షణ పూర్తి చేసుకుని డిప్లమా పట్టా పొందిన డీలర్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. డిప్లమో కో ర్సులు మనం నేర్చుకున్న పరిజ్ఞానాన్ని రైతులకు ఉప యోగపడే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించా రు. ఈ కార్యక్రమంలో జేడీఏ ఆదిరెడ్డి, సంబంధిత అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగును విస్తరించాలి..
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును విస్తరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం తన చాంబర్‌లో ఉద్యానవన శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో 2 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1500 ఎకరాల పరిధిలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 200 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటేషన్ జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, జేడీఏ ఆదిరెడ్డి, హారి ్టకల్చర్ అధికారులు జ్యోతి, శ్రీకాంత్, సంబంధిత అధికారులు, తదిత రులు పాల్గొన్నారు.