Share News

కేసీఆర్‌, కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:36 AM

సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ బతుకమ్మ చీరల బకాయిల చెల్లింపుల కోసం టోకన్లు ఇచ్చి ఎగనామం బెట్టినందుకు కేసీఆర్‌, కేటీఆర్‌ సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తిదారులకు, కార్మికులకు, పద్మశాలి సామాజిక వర్గంకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌, కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి
మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రకాష్‌

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 12: సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ బతుకమ్మ చీరల బకాయిల చెల్లింపుల కోసం టోకన్లు ఇచ్చి ఎగనామం బెట్టినందుకు కేసీఆర్‌, కేటీఆర్‌ సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తిదారులకు, కార్మికులకు, పద్మశాలి సామాజిక వర్గంకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య మాట్లాడారు. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సిరిసిల్లకు వచ్చి జేఏసీ నాయకులతో చర్చించినట్లు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలోని కార్మికులకు 365 రోజులు పని కల్పించడం కోసం జేఏసీ నాయకులతో మంత్రి పొన్నం చర్చించారని, వారి సమక్షంలోనే జౌళి శాఖ డైరెక్టర్‌తో మాట్లాడారని అన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య రాజకీయ నాయకుడిగా ఇంకా పరిణతి చెందలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి లేదా జౌళి శాఖ మంత్రి, జిల్లా మంత్రి హామీ ఇవ్వాలనడం చూస్తే అవగాహన లోపంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీసీ సంక్షేమ శాఖ నుంచే జౌళి శాఖకు నిధులు వెళ్తాయన్న విషయం ఆగయ్య తెలవకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా నేత పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. 365 రోజులు నేత కార్మికులకు పని కల్పించాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, సంబంధిత అధికారులతో అనేక సార్లు చర్చలు జరిపి బకాయిలు చెల్లిచండంపై ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, జౌళిశాఖ మంత్రి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికలకు 15 రోజుల ముందే ఇతర ప్రాజెక్టు పనుల బిల్లులు రూ. 17,000 కోట్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెల్లించిందన్నారు. సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన బతుకమ్మ చీరల బకాయిల చెల్లింపుల కోసం టోకెన్లు ఇచ్చి ఎగనామం బెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే బకాయిలు ఆగిపోయాయని, కరెంట్‌ బిల్లుల తడిపి మోపడైయ్యాయని ఆరోపించారు. సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తిదారుల మెడపై కత్తిపెట్టి గులాబీ కండవా కప్పి ఓట్లు వేస్తేనే బిల్లులు చెల్లిస్తామని బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్థికంగా సర్దుబాటు చేసుకుంటోందని, చిత్తశుద్ధితో బకాయిలను చెల్లిస్తుందని అన్నారు. వస్త్ర ఉత్పత్తిదారులను హైదరాబాద్‌ తీసుకెళ్లి సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో మాట్లాడించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి, జౌళిశాఖ మంత్రి, జిల్లా మంత్రి హామి ఇవ్వాలనడం సరికాదన్నారు. చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌పై చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వల్లే వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెల్లిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సమస్యలను పరిష్కరిం చడం కోసం ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకుంటుందని అందు లో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తమ జేఏసీ సభ్యులతో సమావేశమై చర్చించార న్నారు. జౌళి శాఖ డైరెక్టర్‌ను జేఏసీ సభ్యులు కలిశారని, ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఆర్డర్లతోపాటు ప్రైవేటు ఆర్డర్లు దాదాపు 40 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేయడానికి సానుకూలంగా స్పందించార న్నారు. శ్రీరామ నవమి వరకు బకాయిల్తో దాదాపు రూ. 150 కోట్లు చెల్లిస్తామన్నారన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర పార్టీలు చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు నక్క నర్సయ్య, చేనేత సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప, మాజీ కౌన్సిలర్‌ లక్ష్మీ నారాయణ, నాయకులు మధు, అంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:36 AM