జ్యోతిబా ఫూలే ఆశయ సాధనకు కృషి
ABN , Publish Date - Apr 11 , 2024 | 11:56 PM
మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశ య సాధనకు అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్ లాల్ అన్నారు.
పెద్దపల్లి కల్చరల్, ఏప్రిల్ 11 : మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశ య సాధనకు అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్ లాల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగ తుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్ లాల్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్ర, వారు సాధించిన విజయాలు అందరికీ తెలియాలని జయంతి ఉత్స వాలను ఘనంగా జరుపుతున్నామని అన్నారు. మహనీయులు చూపిన బాటలో అందరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్, సీపీఎం పెద్దపల్లి ఏరియా కార్యదర్శి సిపెళ్లి రవీందర్, కుమ్మరి నవీన్, కుమ్మరి సదయ్య తది తరులు పాల్గొన్నారు.