Share News

భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:28 AM

గోదావరిఖని గోదావరి వంతెన వద్ద ఫిబ్ర వరి 21 నుంచి 24వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లను త్వరతగిన పూర్తి చేయాలంటూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆదేశించారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

కోల్‌సిటీ, జనవరి 31: గోదావరిఖని గోదావరి వంతెన వద్ద ఫిబ్ర వరి 21 నుంచి 24వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లను త్వరతగిన పూర్తి చేయాలంటూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అధికారులకు ఆదేశించారు. బుధవారం జాతర ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా చూడాలని, గతంలో చెత్తను వేసిన ప్రాంతంలో మట్టి తో కప్పి దుర్గంధం వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. జాతర సమయం దగ్గర పడుతున్నందున పనులను వేగవంతం చేయాలని, భక్తులకు తాగునీరు, గోదావరి వద్ద బట్టలు మార్చుకునేందుకు షెడ్ల ఏర్పాట్లు చేయాలని సూ చించారు. సింగరేణి, ఎన్‌టీపీసీ సమన్వయంతో వ్యవహరి స్తూ పనులను నిర్వహించాలన్నారు.

భూమిని చదును చేసిన ఎమ్మెల్యే..

సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో పిచ్చి మొక్క లను, తుమ్మ పొదలను ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ జేసీబీని నడుపుతూ తొలగించారు. బ్లేడ్‌ ట్రాక్టర్‌తో భూమిని చదు ను చేశారు. భక్తులకు అన్నీ ఏర్పాట్లు చేయాలని, ఇబ్బం దులకు గురి కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట కమిషనర్‌ నాగేశ్వర్‌, కార్పొరేటర్‌ మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, కాంగ్రెస్‌ నాయకులు దీటి బాలరాజు, మారెల్లి రాజిరెడ్డి, ఉల్లంగుల రమేష్‌, జనగామ శ్రీనివాస్‌, కారం వినయ్‌, కృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:28 AM