Share News

జై తెలంగాణ అనని వ్యక్తి సీఎంగా ఉండడం దురదృష్టం

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:46 AM

జై తెలంగాణ అనని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం దుర దృష్టకరమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములవాడలో సభ ప్రభుత్వ కార్యక్రమంగా జరిగిన ట్లుగా లేదని ఒక రాజకీయ సభలా జరిగిందన్నారు.

జై తెలంగాణ అనని వ్యక్తి సీఎంగా ఉండడం దురదృష్టం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

- మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జై తెలంగాణ అనని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం దుర దృష్టకరమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములవాడలో సభ ప్రభుత్వ కార్యక్రమంగా జరిగిన ట్లుగా లేదని ఒక రాజకీయ సభలా జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావుల జపం చేస్తున్నాడన్నా రు. ఉద్యమాల గడ్డ అయిన సిరిసిల్ల గత కాంగ్రెస్‌ పాలనలో ఉరిశాలగా మారిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పది సంవత్సరా ల పాటు సిరిసిల్లలో ఆత్మహత్యలు జరగలేదని కాంగ్రెస్‌ తిఅధికారంలోకి వచ్చాక మళ్లీ కార్మికుల ఆత్మహత్యలు మొదల య్యాయని ఆరోపించారు. 2014లో 1.31 కోట్ల ఎకరాల సాగు జరిగితే కేసీఆర్‌ పాలనలో 2023 వరకు 2.68 కోట్ల ఎకరాల సాగు జరిగిందన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా వేములవాడలో ప్రచారానికి వచ్చిన రేవంత్‌రెడ్డి రెండు లక్షల రుణమాఫీని ఏకకాలం లో చేస్తానని రాజన్న గుడి వద్దే చెప్పి రాజన్నను, రైతులను మోసం చేశాడన్నారు. బద్దిపోచమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఇరుకుగా ఉండడంతో 19 కోట్లతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 39 గుంటల స్థలం సేకరించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసిందన్నారు. ప్రజాపాలన అంటూ ప్రజలను, రైతులను మోసం చేశారని రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ అడగట్ల మురళి, జడీ మాజీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మాజీ ఎంపీపీ చంద్రయ్య, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 12:46 AM