Share News

మూత‘బడి’ంది...

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:51 AM

గుడి, బడి ఈ రెండూ లేని ఊరు అసలు ఉం డదేమో అనుకుంటాం. కనీసం ఊహించుకోడానికి కూడా ఇబ్బందిగా ఉం ది కదూ. కానీ ఈ ఊళ్లో ఉన్న సర్కారు బడి మాత్రం దాదాపు రెండేళ్లుగా మూత పడింది.

మూత‘బడి’ంది...
మూతపడిన పాఠశాల భవణం

మూత‘బడి’ంది...

గ్రామంలో పాఠశాల లేక చిన్నారుల ఇక్కట్లు

పట్టించుకోని పాలకులు, అధికారులు

బీర్‌పూర్‌, జనవరి 27 : గుడి, బడి ఈ రెండూ లేని ఊరు అసలు ఉం డదేమో అనుకుంటాం. కనీసం ఊహించుకోడానికి కూడా ఇబ్బందిగా ఉం ది కదూ. కానీ ఈ ఊళ్లో ఉన్న సర్కారు బడి మాత్రం దాదాపు రెండేళ్లుగా మూత పడింది. బడి ఊరికి దూరం కావడంతో కొందరు పిల్లలను బడికి పంపడం మానేసారు. దీంతో రాను రాను తగ్గుతూ వచ్చింది. దీంతో ఆ బడిలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌ పైన మ రో చోటకు వెళ్లడంతో ఇంకేముంది పాఠాలు చెప్పే వారు కూడా లేకుండా పోయారు. దీంతో మెళ్లి మెళ్లిగా బడికి తాళం పడింది. పైసలున్నోళ్లు పక్క ఊర్లో చదువుకుంటున్నారు. పైసలు లేనోళ్లు మాత్రం పక్క ఊర్లోని సర్కా రు బడికి పంపుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం కోసం యేటా బడిబాట నిర్వ హించే విద్యాశాఖ అధికారులకు మాత్రం ఇక్కడి మూత పడ్డ బడి కానరావటం లేదు.

బీర్‌పూర్‌ మండలంలోని రంగాసాగర్‌ గ్రామంలో గతంలో ఊరికి దూ రాన పాఠశాల ఉన్నప్పుడు 20మంది వరకు ఐదవ తరగతి విద్యార్థులు ఉండేవారు. ఊళ్లో ఉన్న గోదావరి ఓడ్డున గ్రామస్థులు అందరూ నివసించే వారు. గ్రామస్థులందరికీ కూడా పాఠశాల దగ్గర్లోనే ఉండేది. కానీ గోదావరి నీటి మట్టం పెరిగి ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయోనని రాను రాను గ్రామస్థులు వారి మకాంను గోదావరికి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాఠశాల గ్రామానికి దూరం కావడంతో చిన్నారులను బడికి పంపకుండా తల్లి దండ్రులు కొంత కాలంగా ఇంటివద్దే ఉంచారు. దీంతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొల్వాయి గ్రామం లోని ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తూ గ్రామంలో పాఠశాలకు వెళ్లని విద్యార్థులను పోగు చేసి ప్రైవేటు పాఠశాల వైపు మళ్లించారు. విష యం తెలియడంతో గ్రామ సర్పంచ్‌ బోడ స్వప్న సాగర్‌ ఆధ్వర్యంలో ప్రైవే టు పాఠశాలల బస్సులు గ్రామంలోనికి రాకుండా అడ్డుకున్నారు. ఆ సమ యంలో ప్రస్తుత పాఠశాల ఊరికి దూరంగా ఉండటంతో గ్రామ పంచా యతీ కార్యాలయం సమీపంలో కొంత కాలం ఇల్లును అద్దెకు తీసుకొని పా ఠశాలను కొనసాగించారు. దినికి తోడు కరోనా రావడం ఆన్‌లైన్‌ తరగతు లు ప్రారంభం కావడంతో అటు విద్యార్థులు, తల్లిదండ్రులు నిరుత్సాహంతో మళ్లీ ప్రైవేటు పాఠశాలలకే చిన్నారులను పంపించడం ప్రారంభించారు. దీంతో రంగసాగర్‌ పాఠశాలకు కేటాయించిన ఉపాధ్యాయులు వెంకట రమణ, అనీల్‌లను డిఫ్యూటేషన్‌పై ఒకరిని కండ్లపల్లి మరొకరిని రగుభా పాఠశాలలకు పంపించడంతో పాఠశాల పూర్తిగా మూత పడిపోయింది. ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు చెందిన సుమారు 40నుంచి50 మంది చి న్నారులను వారి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపగా ఆర్థికంగా వెనుకబడిన కొందరు బీర్‌పూర్‌ మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలకు ఆటోలో పంపుతున్నారు. గ్రామంలో 163 కుటుంబాలు ఉండగా 523 జనా భా ఉంటారు. అందులో 383 మంది ఓటర్లు ఉంటారు ఒక గ్రామ పంచా యతీ పరిధిలో కనీసం పాఠశాల లేకపోవడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అఽధికారులు చొరవ చూపి రం గాసాగర్‌ గ్రామంలో ఎంతో ఇబ్బంది పడుతూ పొరుగు గ్రామాలకు వెల్లు తున్న చిన్నారులపై దృష్టి సారించి ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసి ఈ గ్రామ పాఠశాలకు కేటాయించిన ఉపాధ్యాయులను మళ్లీ గ్రామానికి పంపి విద్యార్థుల కష్టాలు తీర్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

గ్రామస్తులు సహకరించాలి..

ఎంఈవో భీమయ్య

గ్రామ ప్రజలు సహకరించి విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పం పించకుండా గ్రామంలోని పాఠశాలకు పంపిస్తే ఇద్దరు ఉపాధ్యాయులను ప్రతి రోజు వచ్చే ఏర్పాట్లు చేస్తాం. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో పేద పిల్లలకు అన్యాయం జరుగుతోంది. గతంలో చాలా వరకు ప్రయత్నిం చాము. పిల్లల తల్లి దండ్రులు సహకరిండం లేదు.

గతంలో ప్రైవేటు బస్సులు రాకుండా ఆపాము

రంగసాగర్‌ సర్పంచ్‌ బోడ స్వప్న

గతంలో గ్రామంలోనికి వచ్చే ప్రైవేటు బస్సులు రాకుండా అడ్డుకున్నా ము. కొన్ని రోజుల వరకు పంపించకుండా ఉన్నారు. మళ్లీ పంపించడం ప్రారంభించారు. మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు చొరవ చూపి మా గ్రామంలో మళ్లీ పాఠశాల పునఃప్రారంభం అయ్యేలా చూడాలి.

బడి లేక పేద పిల్లలకు ఇబ్బందిగా ఉంది.

రంగసాగర్‌ గ్రామస్థుడు ప్రశాంత్‌

ఆర్థికంగా లేని నిరుపేద కుటుంబాల పిల్లలకు చదువుకోవడానికి చాల ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో పాఠశాల లేక ఆటో కిరాయికి తీసుకొ ని ప్రతి రోజు బీర్‌పూర్‌కు ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారు. మండల స్థాయి అఽధికారులు గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామం లో మళ్లీ ప్రభుత్వ పాఠశాల ప్రారంభం అయ్యేలా చూడాలి.

Updated Date - Jan 28 , 2024 | 12:51 AM