వర్షం కురిసింది.. లోటు తీరింది
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:16 AM
జిల్లా వ్యాప్తంగా కరువు తీరా వాన కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే సగటున సుమారు 27.0 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వానాకాలం సీజన్ ప్రారంభమైన నెల రోజులు అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు సుమారు వారం రోజులుగా దంచికొడుతున్నాయి.

- జిల్లాలో చెరువులు, కుంటలకు జల కళ
- జోరందుకున్న వ్యవసాయ పనులు
- లక్ష ఎకరాలు దాటిన వరి నాట్లు
- కూలీలకు చేతి నిండా పని
జగిత్యాల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా కరువు తీరా వాన కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే సగటున సుమారు 27.0 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వానాకాలం సీజన్ ప్రారంభమైన నెల రోజులు అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు సుమారు వారం రోజులుగా దంచికొడుతున్నాయి. దీంతో పంటలకు ఉపశమనం కలగడమే కాకుండా చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ముసురుతో కూడిన వర్షాలు కురుస్తుండడం వల్ల భారీ వరదలు లేకుండా కొద్ది కొద్దిగా నీరు జలాశయాల్లోకి చేరుతోంది.
వారం రోజులుగా వానలే వానలు..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ నుంచిసెప్టెంబర్ వరకు వర్షా లు కురుస్తుంటాయి. జూలై మొదటి వారం వరకు జిల్లాలో సాధారణ వర్ష పాతం కంటే తక్కువ రికార్డు అయింది. జిల్లాలో జూన్ నెలాఖరు వరకు 164.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 200.8 మిల్లీ మీటర్లు నమోదైంది. అంటే సాధారణం కంటే సుమారు 36 శాతం ఎక్కు వ వర్షపాతం రికార్డు అయింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాధారణం నుంచి అత్యధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. జూ లైలో ఇప్పటివరకు సాధారణం కంటే 35 శాతం అధిక వర్షపాతం నమో దైంది. జిల్లాలో జూలై మాసంలో ఇప్పటివరకు సాధారణంగా 392.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 528.1 మిల్లీ మీటర్ల వర్షపా తం నమోదైంది. సాధారణంగా కురవాల్సిన వర్షం కంటే 20 శాతం నుంచి 35 శాతం తక్కువ వర్షపాతం నమోదైతే లోటు వర్షపాతంగా వాతావరణ శాఖ భావిస్తుంది. అలాగే కురవాల్సిన వర్షం కంటే 20 నుంచి 59 శాతం వరకు ఎక్కువ వర్షపాతం నమోదైతే అధిక వర్షపాతంగా లెక్కిస్తారు. 60 శాతానికి మించి ఉంటే అత్యధిక వర్షపాతంగా పరిగణిస్తారు.
తొమ్మిది మండలాల్లో అధికం.. అయిదు మండలాల్లో అత్యధికం...
జిల్లాలోని తొమ్మిది మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇబ్ర హీంపట్నంలో 44.0 శాతం, జగిత్యాలలో 31.0 శాతం, కోరుట్లలో 40.0 శా తం, మెట్‌పల్లిలో 39.0 శాతం, కథలాపూర్‌లో 34.0 శాతం, మల్యాలలో 59.0 శాతం, పెగడపల్లిలో 45.0 శాతం, బీమారంలో 53.0 శాతం అధికం గా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మల్లాపూర్‌లో 86.0 శాతం, రాయి కల్‌లో 76.0 శాతం, సారంగపూర్‌లో 69.0 శాతం, మేడిపల్లిలో 62.0 శా తం, కొడిమ్యాలలో 72.0 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. బీర్‌పూ ర్, ధర్మపురి, బుగ్గారం, జగిత్యాల రూరల్, గొల్లపల్లి, వెల్గటూరు, ఎండపల్లి మండలాల్లో సాధారణంగా వర్షం కురిసింది.
జోరుగా సాగు పనులు...
జిల్లాలో గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా సుమారు సుమారు లక్ష ఎకరాల్లో నాట్లు పడ్డాయి. వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు సుమారు 1.25 లక్షల ఎకరాల వరకు వరి సాగైంది. నెలాఖరు నాటికి రెండున్నర లక్షల ఎకరాలు దాటే అవకాశముంది. అన్ని పంటలు కలిసి జిల్లాలో 4.50 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ప్రస్తుతం 1.42 లక్షల వరకు సాగవుతోంది. ఇందులో వరి పంటదే సింహభాగం. రైతులు సన్నరకాలు, దొడ్లు రకాలు ఎక్కువ సాగు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు పత్తి 16,230 ఎకరాలు, కందులు 581 ఎకరాలు, సోయాబిన్ 352 ఎకరాలు, మొక్కజొన్న 28,081 ఎకరాలు, అనుములు 165 ఎకరాలు, చెరుకు 579 ఎకరాలు, పసుపు 6,619 ఎకరాలు సాగు అయింది. అయితే శరవేగంగా నాట్లు పడటంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. రైతులు అవసరానికి మించి ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. ఇటు పంటల వివరాలను నమోదు చేసే పనిలో వ్యవసాయాధికారులు నిమగ్నమయ్యారు.
కూలీలకు చేతి నిండా పని...
జిల్లాల్లో వరిసాట్లు వేయడానికి గ్రామాల్లోని స్థానిక మహిళల కూలీలు అధికంగా వస్తున్నారు. వీరితో పాటు ఎప్పటిలాగే యూపీ, ఏపీ, బీహర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున మగ, ఆడ కూలీలు జిల్లాకు వలస వచ్చారు. వానాకాలం, యాసంగి సీజన్‌లో కూలీలను బయట ప్రాంతాల నుంచి తెప్పించడానికి జిల్లాలో చాలా మంది మద్యవర్థులుగా పని చేస్తున్నారు. వచ్చిన వారికి భోజనం, షెల్టర్లు అందిస్తున్నారు. మగ కూలీల బృందంలో 10-15 మంది ఉంటున్నారు. వీరు ఎకరానికి సుమారు రూ. 4,500 నుంచి రూ. 5,400 వరకు కూలీ తీసుకుని నాట్లు వేస్తారు. దీంతో నాట్లు వేసిన ఒక్కో కూలీకి రూ. 500 వరకు ఉపాధి లభిస్తోంది.
ముమ్మరంగా వ్యవసాయ పనులు
- వాణి, జిల్లా వ్యవసాయ అధికారిణి
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వారం రోజులుగా వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఎప్పటికప్పుడు సాగు వివరా లను సేకరించి నమోదు చేస్తున్నాము. వరి నాట్లు ఊపందుకుంటున్నాయి. మరో పక్షం రోజుల వరకు నాట్లు వేసుకునే వీలుంది. వ్యవసాయ దారులు, కూలీలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
పొలం పనుల్లో రైతులు నిమగ్నం
- అల్లూరి మహేందర్ రెడ్డి, రైతు, వేంపేట గ్రామం
ఇటీవల కురుస్తున్న ముసురు వర్షాలతో సాగు పనులు జోరందుకు న్నాయి. పొలం పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పసుపు, చెరుకు తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నా రు. మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండడం ఆశాజనకంగా మారింది.