Share News

కార్మికుల కోసం పోరాడేది ఐఎన్‌టీయూసీ

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:36 AM

సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే ది ఐఎన్‌టీయూసీయేనని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ అన్నా రు.

కార్మికుల కోసం పోరాడేది ఐఎన్‌టీయూసీ

గోదావరిఖని, ఏప్రిల్‌ 21: సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే ది ఐఎన్‌టీయూసీయేనని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ అన్నా రు. ఆదివారం గోదావరిఖనిలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఐఎన్‌టీయూసీ మహాసభ, పెద్దపల్లి పార్లమెంటరీ సన్నాహక సభ విజయవంతం చేసినందుకు నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కార్మికవర్గం బుద్ధి చెప్పిం దని, అదే విధంగా ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్‌ వయోపరిమితి పరిష్కరించడం జరిగిందని, రిటైర్డ్‌ కార్మికుల పెన్షన్‌ పెంపుద లకు కృషి చేయడంతో పాటు పెర్క్స్‌పై కార్మికులు చెల్లించే ఐటీ యాజమాన్యం భరించే విధంగా మంత్రి శ్రీధర్‌బాబు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్ర మానికి ఐఎన్‌టీయూసీ సెంట్రల్‌ నాయకులు, బ్రాంచ్‌ నాయకులు, అన్నీ ఏరి యాల వైస్‌ ప్రెసిడెంట్లు హాజరయ్యారు.

Updated Date - Apr 22 , 2024 | 12:36 AM