Share News

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరకంగా ఐఎన్‌టీయూసీ ధర్నా

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:35 AM

బొగ్గుబ్లాకుల వేలం పాటు, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌(ఐఎన్‌టీయూ సీ) ఆధ్వర్యంలో గురువారం సింగరేణి వ్యాప్తం గా జీఎం కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు.

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరకంగా ఐఎన్‌టీయూసీ ధర్నా

గోదావరిఖని, జూలై 4: బొగ్గుబ్లాకుల వేలం పాటు, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌(ఐఎన్‌టీయూ సీ) ఆధ్వర్యంలో గురువారం సింగరేణి వ్యాప్తం గా జీఎం కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ముందు ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎన్‌టీయూసీ సెంట్రల్‌ సీని యర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ధర్మపురి హాజరయ్యా రు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు వికాస్‌, ఆరెల్లి శ్రీనివాస్‌, దేవులపల్లి రాజేందర్‌, బత్తుల పోచయ్య, మల్లికార్జున్‌, గడ్డం కృష్ణ, నాగరాజు, జగన్మోహన్‌, నీరటి సాగర్‌, గుండేటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

యైుటింక్లయిన్‌కాలనీ, జూలై 4:బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియకు వ్యతిరేకిస్తూ గురువారం ఆర్జీ-2 జీఎం ఆఫీస్‌ ఎదుట ఐఎన్‌టీయూసీ శ్రేణులు ధర్నా చేశాయి. ఈసందర్భంగా ఆర్జీ-2 వైస్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణరెడ్డి మాట్లాడా రు. సంపత్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, రవీందర్‌రెడ్డి, కృష్ణ, కర్క శ్రీనివాస్‌, భీముని సత్యనారా యణ, ఉస్మాన్‌ పాల్గొన్నారు.

రామగిరి, జూలై 4: బొగ్గు గనుల ప్రై వేటీకరణకు వ్యతిరే కిస్తూ గురువారం జీఎం కార్యాలయం లో ఎదుట ఐఎన్‌టీ యూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావుకు వి నతిపత్రం అందజేశారు. ఐఎన్‌టీయూసీ సీని యర్‌ ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, ఆర్జీ-3 ఉ పాధ్యక్షుడు కొట రవీందర్‌రెడ్డి, గడ్డం తిరుపతి, రామారావు, భిక్షనాయక్‌ తదితరులున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:35 AM