నందిమేడారంలో హెలీప్యాడ్ స్థలం పరిశీలన
ABN , Publish Date - Sep 14 , 2024 | 12:50 AM
ధర్మారం మండలంలో శనివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పర్యటిం చే గ్రామాలను శుక్రవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్, ప్రభుత్వ విప్ అడ్ల్లూరి లక్ష్మణ్‌కుమార్ పరీశీలించారు.
ధర్మారం, సెప్టెంబరు 13: ధర్మారం మండలంలో శనివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పర్యటిం చే గ్రామాలను శుక్రవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్, ప్రభుత్వ విప్ అడ్ల్లూరి లక్ష్మణ్‌కుమార్ పరీశీలించారు. మండలంలోని నందిమేడారంలోగల పంప్‌హౌస్ వద్దగల హెలీప్యా డ్ స్థలాన్ని పరీశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. నంది మేడారం, కటికెనపల్లి గ్రామాల్లో 33/11కెవి సబ్‌స్టేషన్‌ల శంకుస్థాప న చేసే స్థలాలను, మార్కెట్ యార్డులో బహిరంగ సభా స్థలాన్ని వారు పరిశీలించారు. వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ, సంబంధిత అధికారులు ఉన్నారు.
పెద్దపల్లిటౌన్ : డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో భద్రత పరమైన ఏర్పాట్లను పరిశీలించారు. సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాలపై అధికారులతో చర్చించారు. డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాలలో పూర్తిస్థాయిలో నిఘా, పటిష్టమైన బందోబస్తు చర్యల పై సూచనలు చేశారు. కార్యక్రమంలో, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘ వేంద్రరావు, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, సుల్తా నాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్, ఎస్‌ఐ లు పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలంలోని రంగాపూర్, రాఘవ పూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు శనివా రం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వస్తున్న దృష్ట్యా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని రాఘవపూర్ సబ్ స్టేషన్‌లో పెద్దపల్లి ఎస్‌ఈ కార్యాలయం, రంగాపూర్‌లో రూ.1.70 కోట్లతో 33/11 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాని కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వస్తున్న ప్రదేశాలను పరిశీలిం చారు. వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘ వేంద్రరావు, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీన్‌కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్‌కుమార్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.