Share News

నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలి

ABN , Publish Date - May 29 , 2024 | 11:44 PM

మండలంలో ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే వ్యవసాయశాఖ దృష్టికి తీసుకురావాలని, చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ అన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలి
విత్తన దుకాణాన్ని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి

ఇల్లంతకుంట, మే 29: మండలంలో ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే వ్యవసాయశాఖ దృష్టికి తీసుకురావాలని, చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ అన్నారు. మండలంలోని పొత్తూరు గ్రామంలోని విత్తన విక్రయ దుకాణాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వానకాలం సీజన్‌కు సంబంధించి పత్తి, ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేసే రైతులు రెండు, మూడు రకాల హైబ్రిడ్‌ విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. పంటల దిగుబడి అనేది నేలల స్వభావం, వాతావరణ అనుకూల పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు. అన్ని రకాల బీజీ2 విత్తనాలు కాయతొలుచు పురుగులను తట్టుకుంటాయన్నారు. మండల వ్యవసాయాధికారి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:44 PM