కార్మికుల భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:28 PM
సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల రైస్ మిల్లర్లు ఇటుక బట్టీల యజమానులు తమ వద్ద పని చేస్తున్న కార్మిక కుటుంబాల రక్షణ, భద్రత చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు.

- పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ
సుల్తానాబాద్, జూన్ 17: సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల రైస్ మిల్లర్లు ఇటుక బట్టీల యజమానులు తమ వద్ద పని చేస్తున్న కార్మిక కుటుంబాల రక్షణ, భద్రత చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. సుల్తానాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం రైస్ మిల్లర్లు, ఇటుక బట్టీల యజమానులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. మిల్లర్లు ముందుగా కార్మికులను పనిలోకి తీసుకునే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. వారికి సంబంధించిన ఆధార్ కార్డులను సేకరించాలని, వారికి ఏమైనా నేర చరిత్ర ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు. లేబర్ రూములను మహిళలకు పురుషులకు వేరువేరుగా నిర్వహించాలని, కుటుంబ సభ్యులందరికీ వేరుగా నివాస ప్రాంతాల ను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా రైస్ మిల్లుల ముఖ ద్వారం నుంచి ఆవరణ మొత్తం వెనకాముందు కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఇటుక బట్టీల ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మైనర్లతో పనులు చేయించవద్దని, మహిళలు, చిన్న పిల్లల కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటుక బట్టీల్లో, రైస్‌మిల్లుల్లో కార్మికులకు సంబంధించి రిజిష్టర్‌ను నిర్వహించాలన్నారు. తమ వద్ద పనిచేస్తున్న కార్మికుల గురించి వారి ప్రవర్తనను గురించి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. వారు మద్యం సేవిస్తు ఏవైనా గొడవ పడుతున్నారా, గంజాయి డ్రగ్స్‌కు బానిసలుగా ఉన్నారా గమనించాలని, అలాంటి వారిని పనులలో పెట్టుకోవద్దని ఏఎస్పీ సూచించారు. ముఖ్యంగా కార్మికులకు వారి కుటుంబాలకు కనీస అవసరాలైన తాగునీరు, సరైన వసతి, కనీస ఏర్పాట్లు చేయాలని వివరించారు. సమావేశంలో సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్, మిల్లర్ల సంఘ నేతలు కేశవరావు, పల్లా మురళి, నగునూరి అశోక్, తిరుపతిరెడ్డి, పురుషోత్తంరావు, ప్రకాశ్‌రావు, విజయపాల్‌రెడ్డి, పన్నాల రాములు, పల్లా వాసు, చకిలం మారుతి, కరుణాకర్, సంతోష్, ప్రసాద్, సతీష్‌రావు తదితరులు పాల్గొన్నారు