Share News

ఎంపీగా గెలిస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తా

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:24 AM

ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి పరిశ్ర మలు తీసుకవచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని పెద్దపల్లి పార్లమెంట్‌ నియో జకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు.

ఎంపీగా గెలిస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తా

పెద్దపల్లి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి పరిశ్ర మలు తీసుకవచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని పెద్దపల్లి పార్లమెంట్‌ నియో జకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన ప్రభు త్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుం ట విజయరమణారావు, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వివేక్‌, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కుటుంబసభ్యులతో కలిసి రెండు సెట్లలో నామినేషన్‌ పత్రాలను రిటర్నిం గ్‌ అధికారి, కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌కు అందజేశారు. అనంతరం ఆయన మీడి యా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజక వర్గ ప్రజలకు సేవ చేసిన కాకా వెంకటస్వామి నీడలో పెరిగానన్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా కాకా సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించారన్నారు. పద వీ విరమణ చేసిన తర్వాత పింఛన్‌ వచ్చేలా కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్దపల్లి ఎంపీగా తన తండ్రి డాక్టర్‌ వివేక్‌ పార్లమెంట్‌లో పోరాటం చేశారని గుర్తు చేశారని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాశనం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌ ఆయ న కుటుంబ సభ్యులు నిరంకుశ పాలనతో అందిన కాడికి దోచుకుని వాళ్ల కడుపు నింపుకున్నారని విమర్శించారు. సహజ వనరులన్నింటిని కొల్లగొట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని అన్నారు. మీ అశీర్వాదంతో తాను ఎంపీగా గెలిస్తే నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులను కాపాడి పరిశ్రమలను తీసుక వచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. పది మంది బాగుంటే నేను బాగుంటానని కోరుకునే వ్యక్తి అని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్య మని, ఈప్రాంత అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తానన్నారు. అంతకు ముందు ప్రభుత్వ విప్‌ లక్ష్మన్‌ కుమార్‌ మాట్లాడుతూ వెంకటస్వామి కేంద్ర మంత్రిగా, ఎం పీగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడ్డారని ఆ కుటుంబ వారసుడిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల న్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు తల స్నానం చేస్తానని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:24 AM