హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jun 01 , 2024 | 12:26 AM
హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని జిల్లా సాధన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూరాబాద్ మున్సిపల్ పార్క్‌లో జిల్లా సాధన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
హుజూరాబాద్, మే 31: హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని జిల్లా సాధన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూరాబాద్ మున్సిపల్ పార్క్‌లో జిల్లా సాధన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ భీమోజు సదానందం మాట్లాడుతూ హుజూరాబాద్‌కు చుట్టు పక్కల ఉన్న 14 మండలాలను కలుపుకుని జిల్లాగా ప్రకటించాలన్నారు. 2016లో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, జిల్లాల పునర్విభజనపైన వార్తలు వస్తున్న నేపథ్యంలో పీవీ నర్సింహారావు పేరుతో హుజూరాబాద్ కేంద్రగా జిల్లా ఏర్పాటు చేయలాని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించేంత వరకు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వేల్పుల రత్నం, పొడిశెట్టి వెంకట్రాజం, ఆలేటి రవీందర్, కొడిగూటి మొగిలయ్య, రాజన్న, రమేష్, శేఖర్, ప్రభాకర్, సారయ్య, సమ్మయ్య, రాజేశ్వర్, రవీందర్, రాజలింగం, వెంకన్న పాల్గొన్నారు.