Share News

అంతర్జాతీయ స్థాయిలో మైనింగ్‌లో అపార అవకాశాలు

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:24 AM

అంతర్జాతీయ స్థాయిలో మైనింగ్‌లో ఉజ్వల భవిష్యత్‌, అపార అవకాశాలు ఉన్నాయని సింగరేణి డైరెక్టర్‌(పిపి) వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో మైనింగ్‌లో అపార అవకాశాలు

రామగిరి, జనవరి 20: అంతర్జాతీయ స్థాయిలో మైనింగ్‌లో ఉజ్వల భవిష్యత్‌, అపార అవకాశాలు ఉన్నాయని సింగరేణి డైరెక్టర్‌(పిపి) వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మంథని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించిన కోల్‌మైనింగ్‌ భవిష్యత్తు అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హజరై జ్యోతిప్ర జ్వలన చేశారు. అనంతరం కళాశాలకు చెందిన మైనింగ్‌ డిపార్టమెంట్‌ విద్యార్థులు, మైనింగ్‌ ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సింగరేణి స్టూడెంట్‌ చాప్టర్‌ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవ స్థ మైనింగ్‌ పైనే ఆధారపడి ఉందన్నారు. దేశం ఆర్థికంగా, సామాజికంగా బలపడా లంటే మైనింగ్‌ వ్యవస్థ కీలకమన్నారు. త్వరలోనే సింగరేణి మైనింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందన్నారు. అందులో బాలికలకు సైతం అవకాశం కల్పిస్తామన్నారు. జేఎన్టీయూ కళాశాలకు సింగరేణి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎంఈఏఐ వివరాలను సెక్రెటరీ జనరల్‌ ఎం. నర్సయ్య వెల్లడించారు. కోల్‌మైనింగ్‌ భవిష్యత్‌పై స్వాడ్రోన్‌ ఇన్‌ఫ్రా అండ్‌మైనింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో సైర్యక్‌జోసఫ్‌, డాక్టర్‌ లింగంపల్లి సాయివినయ్‌, డాక్టర్‌ కుమార్‌ దోరేటిలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-3,2 జీఎంలు సుధాకర్‌ రావు, ఎల్‌వీ సూర్యనారాయణ, వివిధ విభాగల అధిపతులు డాక్టర్‌ మూర్తి, మైనిం గ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:24 AM