Share News

గడువులోగా హోం ఓటింగ్‌ పూర్తిచేయాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:24 AM

ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన గడువులోగా హోం ఓటింగ్‌ను సజావుగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ అన్నారు.

గడువులోగా హోం ఓటింగ్‌ పూర్తిచేయాలి

జ్యోతినగర్‌, ఏప్రిల్‌ 29 : ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన గడువులోగా హోం ఓటింగ్‌ను సజావుగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 85 సంవత్సరాలు నిండిన సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్దనే ఓటు వేసే హ క్కును ఎన్నికల కమిషన్‌ కల్గించిందని, దీనికి సంబంధించి రామగుండం సెగ్మెంట్‌ పరిధిలో వచ్చిన దరఖాస్తులకు ఆమోదించి వారికి ఇంటి వద్దనే ఓటువేసే ఏర్పాట్లు చేయాలన్నారు. హోం ఓటింగ్‌కు సంబధించి బృందాలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, రూట్‌ మ్యాప్‌, షెడ్యూల్‌ రూపొందించామని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారుల ద్వారా సంబంధిత ఓటర్లుకు షెడ్యూల్‌ సమాచారం అందించామన్నారు. బ్యాలెట్‌ పత్రాలను మే 2 నాటికి బృందాలకు అందజేస్తామన్నారు. మే 3 నంచి 8న మొదటి విడత, మే 9 రెండోవిడత హోం ఓటింగ్‌ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. అనంతరం మేడిపల్లిలోని బూత్‌లో ఓటరు స్లిప్పుల పంపిణీని అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. ఆమె వెంట పాలకుర్తి తహసీల్దార్‌ జ్యోతి, డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:25 AM