Share News

మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:35 PM

రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీజేపీ నాయకులు సవాల్‌ విసిరారు. శుక్రవారం కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ తరపున నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారి పమేలా సత్పతికి బీజేపీ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్‌ డి శంకర్‌, బండ రమణారెడ్డి అందించారు.

మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలి

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 20: రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీజేపీ నాయకులు సవాల్‌ విసిరారు. శుక్రవారం కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ తరపున నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారి పమేలా సత్పతికి బీజేపీ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్‌ డి శంకర్‌, బండ రమణారెడ్డి అందించారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దమ్ముంటే పొన్నం మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని ఎవరికి ప్రజాదరణ ఉందో తేలిపోతుందన్నారు. పొన్నంను చూసి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా భయపడి దగ్గరకు రావడం లేదన్నారు. ఆయనను మంచి డాక్టర్‌కు చూపించాలని కాంగ్రెస్‌ నాయకులకు హితవు పలికారు. కొద్ది రోజులుగా బీజేపీపైనా బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిం చారు. పొన్నం తీరు చూస్తే ఆయనకు మతి తప్పినట్లుందన్నారు. పిచ్చి మాటలు కాకుండా నేరుగా దమ్ముంటే ఆయనే స్వయంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. మైకు దొరికింది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానన్న విషయం మరిచి పోయి మాట్లాడుతున్నాడన్నారు. చివరకు న్యాయ స్థానాలపై కూడా ఆరోపణలు చేస్తున్నాడన్నారు. శరత్‌చంద్రారెడ్డికి బెయిల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు అని బెయిల్‌కు బాండ్స్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నాడంటే ఏమనాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయాలని కోరారు. ఏ సర్వేలు చూసినా బండి సంజయ్‌ అత్యధిక మెజారిటీతో గెలువబోతున్నారని తేలడంతో పొన్నంకు ప్రస్టేషన్‌ ఎక్కువైందన్నారు. అందుకే కరీంనగర్‌ నుంచి అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక పోతున్నారన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోతే మంత్రి పదవికే ఎసరొస్తుందనే భయం పట్టుకుందన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మంత్రిగా ఉన్నప్పు డు చేసే వ్యాఖ్యలు ఆదర్శంగా హుందాగా ఉంటే ప్రజలు హర్షిస్తారన్నారు. కానీ పొన్నం శృతిమించి మాట్లాడుతున్నాడన్నారు. పొన్నం ప్రభాకర్‌ వద్దకు వెళ్లాలంటే ఆ పార్టీ నేతలే భయపడుతున్నారన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:35 PM