Share News

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:48 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని కరీంనగర్‌ జిల్లా జైలులో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ లక్ష్మిలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలందరూ పురుషులతో పోటీ పడుతూ అన్నిరంగాలలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కరీంనగర్‌ క్రైం, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని కరీంనగర్‌ జిల్లా జైలులో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ లక్ష్మిలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలందరూ పురుషులతో పోటీ పడుతూ అన్నిరంగాలలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సరస్వతి కేక్‌కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ జి సమ్మయ్య, జైలర్‌ బి రమేష్‌, డిప్యూటీ జైలర్‌ కె శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ సుధాకర్‌ రెడ్డ్డి పాల్గొన్నారు.

ఫకరీంనగర్‌ టౌన్‌: ఒకేసారి పలు ఉద్యోగాలకు ఎంపికైన పుప్పాల మమత ను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ సతీమణి డాక్టర్‌ బోయినపల్లి మాధవి అభినందించారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని వినోద్‌కుమార్‌ క్యాంపు కార్యాలయంలో ఐదు ఉద్యోగాలు సాధించిన మమతను సత్కరించారు. ఈ సందర్బంగా డాక్టర్‌ మాధవి మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. మహిళలు ఒకవైపు కుటుంబం మరోవైపు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస్‌, కార్యదర్శి జక్కని సాయిరాం, ఉపాధ్యక్షుడు శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫకరీంనగర్‌ కల్చరల్‌: నగరంలోని 31వ డివిజన్‌, లక్ష్మీనగర్‌లోని పార్వతీనగర్‌లో పార్వతీనగర్‌ కమ్యూనిటీ కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. ఆత్మగౌరవంతో హక్కుల కోసం పోరాడుతూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీనగర్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు చిలుక ధర్మయ్య, తంగళ్ళ విష్ణు, కోశాధికారి జి రవీందర్‌, కార్యదర్శి జి రాజు, ఆంజనేయులు, రామన్న, శంకర్‌, రాజు, రఘు, చారి, శిరీష, శశికళ, సభ్యులు పాల్గొన్నారు.

రెనే ఆసుపత్రిలో..

ఫసుభాష్‌నగర్‌: ప్రతి మహిళ చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి మేకల అరుణ అన్నారు. శుక్రవారం నగరంలోని రెనే ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అథితిగా హాజరై మాట్లాడుతూ నేటి సమాజంలో వివాహ వ్యవస్థ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. యుక్తవయస్సులో ఆకర్షణలకు గురి కాకుండా సరైన జీవన మార్గాన్ని అనుసరించడం ఎంతో అవసరమని అన్నారు. చట్టాలను గౌరవించాలని సూచించారు. నేడు వివాహం జరిగిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో జంటలు విడాకులు తీసుకుంటున్నాయని, ఇది సరైన జీవన విధానం కాదన్నారు. ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలన్నారు.

రెనే ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ బంగారి స్వామి మాట్లాడుతూ వైద్య రంగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. రోగులకు సేవలందించే విషయంలో నర్సింగ్‌ సిబ్బంది చేసే సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. తమ ఆసుపత్రిలో పూర్తిస్థాయి స్నేహపూరిత వాతావరణంతో కూడుకుని ఉంటుందని, స్త్రీలకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నామన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రజనీప్రియదర్శిని మాట్లాడుతూ ప్రతి మహిళ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. స్త్రీ లేనిదే సమాజంలో పరిపూర్ణత లేదన్నారు. ఈ సందర్భంగా న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ పారుపెల్లి హరిత, డాక్టర్‌ జె రజిత, డాక్టర్‌ రజనీప్రియదర్శినిలతోపాటు ఆసుపత్రిలోని ప్రతి విభాగంలోని మహిళ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీంద్రాచారి, డాక్టర్‌ నిఖిల్‌లక్ష్మన్‌, కెప్టెన్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి, ఆసుపత్రి జనరల్‌ మేనేజర్‌ అరవింద్‌రావు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో..

ఫసుభాష్‌నగర్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కరీంనగర్‌ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం నగరంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళలను ఈసందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్‌ కేశవరెడ్డి, కార్యదర్శి ఊట్కూరి రాధాకృష్ణరెడ్డి, కార్యవర్గ సభ్యుడు కోల అన్నారెడ్డి, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎంఎల్‌ఎన్‌ రెడ్డి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ఫహుజూరాబాద్‌: హుజూరాబాద్‌ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక మహిళలను సన్మానించారు. అలాగే సీఎస్‌ఐ చర్చీలో మహిళల గురించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఫజమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని ధర్మారంలో గల బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల వికాస సెంటర్‌ మేనేజర్‌ పబ్బు సులోచన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషు లతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్షకు గురి అవుతూనే ఉన్నారని తెలిపారు. మహిళలు మరింత శక్తి వంచన లేకుండా కృషి చేసి దానిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు, ప్రభుత్వాలు, కార్మికుల చట్టాలను సవరించి పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కో-ఆర్డినేటర్లు సుమలత, స్వాతి, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:49 AM