Share News

నైపుణ్య శిక్షణతో ఉపాధి గ్యారంటీ

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:33 AM

జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు నైపు ణ్య శిక్షణతో గ్యారంటీ ఉపాధి అందించే దిశగా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ అమలు చేస్తోంద ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.

నైపుణ్య శిక్షణతో ఉపాధి గ్యారంటీ

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు నైపు ణ్య శిక్షణతో గ్యారంటీ ఉపాధి అందించే దిశగా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ అమలు చేస్తోంద ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం ఆయన టీవర్క్స్‌ సీఈవో జోగేందర్‌తో కలిసి పెద్ద పల్లి ఐటీఐ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో ఏటీసీ కేంద్రాలకు టీవర్క్స్‌ అందించే సహకారం, ఏటీసీ కోర్సుల ద్వారా మా ర్కెట్‌లో యువతకు అందే ఉపాధి అవకాశాల వివరాలతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ను టీవర్క్స్‌ సీఈవో జోగేందర్‌ అందించారు. పెద్దపల్లి ఐటీఐ పరిశీలనలో ఏటీసీ కేంద్రాలలో ఎన్ని సీట్లు ఇప్పటివరకు భర్తీ అయ్యాయో వివ రాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు ప్రభుత్వం మొదటి దశలోనే 2 ఏటీసీ కేంద్రాలను మంజూరుచేసిందని, ఇందులో గల 6 కోర్సులకు పదవ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులు ఈనెల30లోపు అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏటీసీ కేంద్రాలలో వివిధ కోర్సులకు సంబంధించి వచ్చిన సామగ్రిని పరిశీలించారు. ఐటీఐ భవనం రిన్నోవేషన్‌ పనుల కు ప్రతిపాదనలు అందించాలని అధికారులకు సూచించారు. తరగతి గదులలో లీకేజీలు ఉంటే వాటి నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులును కలెక్టర్‌ ఆదేశించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్‌ వెంట ఐటీఐ. ప్రిన్సిపాల్‌ వెంకట్‌రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:33 AM