Share News

నామినేటెడ్‌ పదవుల భర్తీపై సర్కారు దృష్టి

ABN , Publish Date - Jan 13 , 2024 | 12:46 AM

దశాబ్దకాలంగా అధికారంలో లేక పదవులు పొందలేక, పనులు చేసుకోలేక అవస్థలు పడ్డ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఈ సారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెం చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అందుకు తగ్గట్టే అధి కారం చేపట్టిన నెల రోజుల్లో నామినేటెడ్‌ పదవుల భర్తీ దృష్టి సారించారు.

నామినేటెడ్‌ పదవుల భర్తీపై సర్కారు దృష్టి

ఇప్పటికే గ్రంథాలయ సంస్థ పాలకవర్గం రద్దు

- అదే దారిలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గాలు

- దేవాదాయ, ధర్మాదాయ, ఇతర శాఖల్లోనూ భర్తీకానున్న పోస్టులు

- సర్కారు పెద్దల చుట్టూ చోటా మోటా నేతల ప్రదక్షిణలు

జగిత్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): దశాబ్దకాలంగా అధికారంలో లేక పదవులు పొందలేక, పనులు చేసుకోలేక అవస్థలు పడ్డ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఈ సారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెం చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అందుకు తగ్గట్టే అధి కారం చేపట్టిన నెల రోజుల్లో నామినేటెడ్‌ పదవుల భర్తీ దృష్టి సారించారు. ఇప్పటికే వివిధ సంస్థలు, కార్పొరేషన్ల పాలక వర్గాలను రద్దు చేస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్‌ కమిటీల పాలక వర్గాలను కూడా రద్దు చేస్తున్నామని ఇటీవల సీఎం ప్రకటించారు. దీంతో కొత్తవా రి తో ఆయా పదవులను భర్తీ చేయడానికి మార్గం సుగమమైంది. పార్టీలో సీనియర్‌ నేతలను రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్‌ చైర్మన్‌లుగా, డైరెక్టర్లుగా ని యమించే అవకాశాలున్నాయి. అలాగే ద్వితీయ శ్రేణి నేతలను జిల్లా, ని యోజకవర్గ స్థాయిలోని వివిధ సంస్థల్లో నామినేట్‌ చేయనున్నారు. జిల్లా లో గ్రంథాలయ సంస్థ అలాగే పదమూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లు ఉన్నాయి. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌తో పాటు సభ్యులను నామినేట్‌ చేస్తారు. అలాగే మార్కెట్‌ కమిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లను ని యమిస్తారు. వీటితో పాటు జిల్లాలోని ఆయా దేవాలయాల అభివృద్ధి కమి టీలకు సంబంధించి పదవులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీంతో కాం గ్రెస్‌ నేతల్లో ఆశలు పెరిగాయి.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు...ఎమ్మెల్సీ ఆశీస్సులుంటేనే...

జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆశీస్సులుంటేనే నామినేటెడ్‌ పదవులు దక్కే అవ కాశాలున్నాయి. ఆయా నామినేటెడ్‌ పదవులపై కన్నేసిన నేతలు ఎమ్మెల్యే లు, నాయకులను కలిసి తమకు అవకాశం ఇప్పించాలని విన్నవించుకుం టున్నారు. జిల్లాలో కేవలం ధర్మపురి నియోజక వర్గంలో మాత్రమే కాంగ్రె స్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. చొప్పదండి, వేములవాడ నియోజక వర్గాల్లో సైతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహిస్తున్నారు. మిగిలిన జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహిస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జి సెగ్మెంట్‌ ఇన్‌చార్జిలు ప్రతిపాదించిన వారికి నామినేటెడ్‌ పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేటెడ్‌ పదవులు ధర్మపురిలో ఎమ్మెల్యే, విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జగిత్యాలలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి, కోరుట్లలో పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగ్‌ రావులు ప్రతిపాదించిన వారినే నియమించే అవకాశం ఉంటుంది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గ కాం గ్రెస్‌ ముఖ్యనేతల సూచనల మేరకు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టను న్నారు. పార్లమెంటు ఎన్నికల్లోపు నామినేటెడ్‌ పదవులు పంచడం ద్వారా ఎన్నికల్లో మరింత కష్టపడతారని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కొం దరికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వగా, మిగిలిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించనున్నారు.

జిల్లాలో పదమూడు మార్కెట్‌ కమిటీలు...

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు పదమూడు ఉన్నాయి. ఒక్కో దానిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు మరో పన్నెండు మంది డైరెక్టర్లను నియమించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో మార్కెట్‌ కమిటీలో పద్నాలుగు మందికి అవకాశం దక్కుతుంది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో జగి త్యాల, రాయికల్‌ మార్కెట్‌ కమిటీలు, కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ ఏఎంసీలు, ధర్మపురి నియోజక వ ర్గంలో ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూరు మార్కెట్‌ కమిటీలున్నా యి. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలో మే డిపల్లి, కథలాపూర్‌ కమిటీలు, కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజక వ ర్గం పరిధిలో మల్యాల, కొడిమ్యాల మార్కెట్‌ కమిటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులతో పాటు డైరెక్టర్లను నియమిస్తారు.

ఆలయాలకు సైతం కమిటీలు...

జిల్లాలోని పలు ఆలయాలకు కమిటీలను నామినేట్‌ చేస్తారు. చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు ఉంటారు. జిల్లాలో ప్రధానంగా ధర్మపురి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం, మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ దేవస్థానం, సారంగపూర్‌ మండలం పెంబెట్ల రాజరాజ్వేరస్వామి దేవస్థానం, ఇబ్రహీం పట్నం మండలం గండి హనుమాన్‌ దేవస్థానం, మల్లాపూర్‌ మండలం వాల్గొండ రామలింగేశ్వర స్వామి ఆలయం, మల్లాపూర్‌ కనకసోమేశ్వర స్వామి ఆలయం, కోరుట్ల సాయిబాబా ఆలయంలతో పాటు ఇతర ఆల యాలకు సైతం నామినేటెడ్‌ పదవులను కేటాయించనున్నారు.

ప్రయత్నాలు షురూ....

నామినేటెడ్‌ పదవుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ త్వరలో మొదలు కానుంది. దీంతో ఆశావహులు ప్రయత్నాలు షురూ చేశారు. జగిత్యాల, కో రుట్ల, ధర్మపురి నియోజకవర్గాలతో పాటు చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్‌, మేడిపల్లి, బీమారం మండలాల్లో కాంగ్రెస్‌ పార్టీలో ఏళ్ల తర బడిగా పనిచేస్తున్న చాలామంది సీనియర్లు తమకు అవకాశం దొరుకు తుందనే ఆశతో ఉన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వాళ్లంతా ఇప్పుడు తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మె ల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ల ద్వారా పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారి అనుగ్రహం కోసం పలువురు చోటా మోటా నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రజాప్రతి నిధుల సహకారంతో పదవులు పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తు న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నామినేటెడ్‌ భర్తీ ప్రక్రియ చేపడితే పదవులు ఎవరిని వరిస్తాయో వేచిచూడాలి.

Updated Date - Jan 13 , 2024 | 12:46 AM