Share News

ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:29 AM

ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
వివరాలు తెలుసుకుంటున్న ఆది శ్రీనివాస్‌

వేములవాడ టౌన్‌, జనవరి 11 : ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌ ఏరియా ఆసుపత్రిని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకం నిరుపేదలకు ఉపయోగపడాలని, వారి వరకు చేరాలనేదే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఏరియా ఆసుపత్రిపై ఎంతో నమ్మకంతో వస్తున్న రోగులకు మెరుగైన వెద్యాన్ని అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగించాలని వైద్యులను కోరారు. ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షలకు పెంచడం గొప్ప విషయమని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసు కోవాలని అన్నారు. రోగులకు వైద్యం అందించడంలో వైద్యులది ముఖ్యపాత్ర అనిఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం వేము లవాడ పట్టణంలోని బాలానగర్‌లో నూతన రేషన్‌ షాపును ప్రారంభించారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ రేగులపాటి మహేష్‌రావు నాయకులు సాగరం వెంకటస్వామి, సంద్రగిరి శ్రీనివాస్‌, కనికారపు రాకేష్‌, నాగుల విష్ణు, అక్కనపెల్లి నరేష్‌ తదితరులు ఉన్నారు.

యువత వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలి

యువత వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మండలం అగ్రహారంలో ఏర్పాటు చేసిన జాతీయ యువజన దినోత్సవంలో మాట్లాడారు. విద్యార్థులకు వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వివేకానందుడు ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తిని నింపారన్నారు. సమావేశంలో నరేన్‌ ఫౌండేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:29 AM