Share News

ప్రత్యక్ష పరిశీలనతో మంచి అనుభవం

ABN , Publish Date - May 25 , 2024 | 12:42 AM

ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారు పథకాల అమలును ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో మంచి అనుభవం కలుగుతుందని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సెంట్రల్‌ సెక్రటేరీయేట్‌కు చెందిన అసిస్టెంట్‌ సెక్షన్‌ అఫీసర్లు శిక్షణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 27 మంది ఈ నెల 20వ తేది నుంచి పర్యటించారు

ప్రత్యక్ష పరిశీలనతో మంచి అనుభవం
కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో శిక్షణ అధికారులు

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- ఏఎస్‌వో శిక్షణ అధికారుల పర్యటన ముగింపు

సిరిసిల్ల, మే 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారు పథకాల అమలును ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో మంచి అనుభవం కలుగుతుందని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సెంట్రల్‌ సెక్రటేరీయేట్‌కు చెందిన అసిస్టెంట్‌ సెక్షన్‌ అఫీసర్లు శిక్షణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 27 మంది ఈ నెల 20వ తేది నుంచి పర్యటించారు. ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో అనురాగ్‌ జయంతితో సమా వేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కేంద్ర రక్షణ, ప ట్టణ గృహనిర్మాణాలు, రహదారులు, ఉపాధి కల్పన తదితర అంశాల్లో పరిశీలించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విధి ని ర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా అవగాహన వ స్తుందన్నారు. సంస్కృతిసంప్రదాయాలతో కూడిన పండుగ లు జీవనశైలి మధురానూభూతిని ఇస్తుందన్నారు. జడ్పీ సీఈవో ఉమారాణి మాట్లాడుతూ జిల్లాలో రామన్నపల్లి, నామాపూర్‌, బొప్పాపూర్‌, సనుగుల, నర్మాల గ్రామాల్లో ఉపాధిహామీ పనులు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌, పంటల తీరును పరిశీలించినట్లు తెలిపారు. రీజినల్‌ శిక్షణ కేంద్రం మేనేజర్‌ భిక్షపతి ఉన్నారు.

దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌: మీసేవలో వచ్చిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని తహసీల్దార్లను కలెక్టర్‌ అను రాగ్‌ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో శుక్రవా రం ధరణి, మీసేవ, పెండింగ్‌ కోర్టు కేసులు, ధాన్యం కొ నుగోళ్లపై తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ ధరణిలో వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించి తమ పరిధిలోని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. తహసీల్దార్ల పరిధిలో లేని వాటిని ఆర్డీవోలు, కలెక్టర్‌కు ఫార్వర్డ్‌ చేయాలని సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, తమ పరిధిలోని కోర్టు కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ ఖీమ్యానా యక్‌ మాట్లాడుతూ ఆయా మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు పరిశీలించాల న్నారు. లారీ కొరత లేకుండా చూడడంతోపాటు ఇతర ఇబ్బందు లు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావా లన్నారు. రైస్‌ మిల్లర్లలో ధాన్యం అన్‌లోడ్‌ లోడింగ్‌ త్వరగా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరే ట్‌ ఏవో రాంరెడ్డి, పర్యవేక్షకులు శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:42 AM