మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
ABN , Publish Date - Oct 09 , 2024 | 12:03 AM
దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం 6వ రోజు అమ్మవారు మహా లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 8: దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం 6వ రోజు అమ్మవారు మహా లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పవర్ హౌస్‌కాలనీ పవర్‌హౌస్‌లోని దుర్గాదేవి ఆలయంతో పాటు జవహర్‌నగర్‌లోని జయదుర్గాదేవి ఆలయం లో భక్తులు, అమ్మవారి మాలధారణ భక్తులు దర్శిం చుకుని పూజలు చేశారు. పవర్‌హౌస్ దేవాలయంలో పెద్దఎత్తున మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించి అమ్మవారి చీరలకు వేలం పాటలు నిర్వహించారు. పలు మండపాల్లో భక్తులు అమ్మవారికి పూజలు, హోమాలు నిర్వహించారు. 11వ డివిజన్ భగత్‌సింగ్ నగర్‌లో కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వినిప్రకాష్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన చండీ యాగం కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ హాజరై అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీయాగం లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పలు కాలనీల్లో ఏర్పాటుచే సిన మండపాల్లో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.
ఎలిగేడు :మండల కేంద్రంలోని సాయిబాబా ఆల యంలో ప్రతిష్టించిన శ్రీదుర్గామాత నవరాత్రోత్సవా ల్లో భాగంగా అమ్మవారు శ్రీమహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మహిళ భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమపూజ నిర్వహించారు. మిగతా గ్రా మాల్లో దుర్గామాతకు పూజలు నిర్వహించారు. అనం తరం అన్నదానం చేశారు.
ఓదెల : దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మంగళ వారం నాటికి ఆరవ రోజుకు చేరిన సందర్భంగా, దుర్గ మాత లక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. ఈ మేరకు కోదండ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గ మాతను రూ.10,116రూపాయలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, అలాగే మాలధారణ భక్తు లు పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్ : మండలంలోని చీకురాయిలో దుర్గామాత మండపంలో దసరా సినిమా డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి, మాజీ సర్పంచ్ బండారు త్రివేణి డైరెక్టర్ కుటుంబ సభ్యులకు గజమాలతో సత్కరించారు. ఈసందర్భంగా గ్రామ ప్రజలు, యువకులు ఫోటోలో దిగేందుకు పోటీ పడ్డారు.
మంథని : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భం గా మంత్రపురి శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు లోకే కుటుంబ సభ్యులు భారీ ఎత్తున అన్నదానం చేశారు. శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం ఆలయంలోని శ్రీమహాలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి రాత్రి వర కు అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తులతో సందడి గా మారింది. ఆలయానికి భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులకు లోకే కుటుంబ సభ్యులు అన్న ప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్స న్ పెండ్రి రమ-సురేష్‌రెడ్డి, న్యాయవాది లోకే రాధా కిషన్‌రావు, లోకే సుధాకర్‌రావు దంపతులు, లోకే మనోహర్‌రావు, లోకే శ్రీధర్‌రావు పాల్గొన్నారు.
కమాన్‌పూర్ : మండల కేంద్రంలో ప్రతిష్టించిన దుర్గాదేవి బీజేపీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి దర్శించుకున్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు జంగపల్లి అజయ్, మచ్చగిరి రాము, మట్ట శంకర్, మల్లారపు అరుణ్‌కుమార్, లింగస్వామి, శ్యాంసుంద ర్, గట్టు శ్రీనివాస్, కొమ్ము శ్రీనివాస్, గోపు పర్వతాలు తదితరులు ఉన్నారు.