Share News

వైభవంగా గోదా రంగనాథస్వామి కల్యాణం

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:25 AM

కరీంనగర్‌ వేదభవనంలో త్రిదండి అహోబిల రామానుజ జీయరుస్వామి పర్యవేక్షణలో, వికాసతరంగిణి ఆధ్వర్యంలో గోదా రంగనాథస్వామి కల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.

 వైభవంగా గోదా రంగనాథస్వామి కల్యాణం

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 28: కరీంనగర్‌ వేదభవనంలో త్రిదండి అహోబిల రామానుజ జీయరుస్వామి పర్యవేక్షణలో, వికాసతరంగిణి ఆధ్వర్యంలో గోదా రంగనాథస్వామి కల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. తీర్థగోష్ఠి అనంతరం అందంగా అలంకరించిన కల్యాణ వేదికపై వేదభవనం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె వరప్రసాదాచార్యుల బృందం వైదిక నిర్వహణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. గోదాదేవి అచంచల భక్తి శ్రద్ధలతో శ్రీరంగనాథుడిని చేరిందని, భక్తి మార్గం చాలా గొప్పదని అన్నారు. చిన్న జీయర్‌ స్వామి పిలుపు మేరకు సమతాకుంభ్‌-2024లో భాగంగా అన్ని ప్రాంతాల వారు సకల జనుల క్షేమం కోసం 27 రోజుల దీక్షను చేపట్టి శంషాబాద్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రానికి 28వ రోజున ఉదయం చేరుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వికాసతరంగిణి జిల్లా అధ్యక్షుడు కె గౌతమరావు, డాక్టర్‌ జగన్నాథరెడ్డి, డాక్టర్‌ శివకుమార్‌, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, అశోక్‌రావు, ప్రతాపరెడ్డి, రవీందర్‌రావు, జగన్నాథరావు, ఎస్‌ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:25 AM